Gautami Naik: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (women’s premier league) లో కొత్త కొత్త ప్లేయర్లు ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bengaluru) వరుస విజయాలతో దూసుకుపోతోంది. స్మృతి మందాన (Smriti mandhana) నాయకత్వంలో బెంగళూరు జట్టు ఇప్పటికే ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఉత్తరప్రదేశ్ వారియర్స్ (Uttar Pradesh warriors) ను ఓడించింది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
బెంగళూరు జట్టులో గ్రేస్, స్మృతి మందాన ఓపెనర్లుగా దుమ్ము రేపుతున్నారు. వీరిద్దరూ బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో బెంగుళూరు జట్టు అద్భుతమైన భాగస్వామ్యలను నమోదు చేస్తోంది. అగ్నికి వాయువు తోడైనట్టుగా.. ఇప్పుడు బెంగళూరు జట్టులోకి మరో కీలకమైన ప్లేయర్ ఎంట్రీ ఇవ్వబోతోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బెంగుళూరు జట్టులోకి గౌతమి నాయక్ (Gautami Naik) అనే ప్లేయర్ వస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే రెండు విజయాలు సాధించిన బెంగళూరు జట్టు.. వచ్చే మ్యాచ్లలో గెలుపులను అందుకోవాలనే అంచనా తో ఉంది. అందువల్లే జట్టును మరింత బలోపేతం చేయడానికి గౌతమి నాయక్ ను తీసుకోవాలని ఆలోచనతో ఉంది. గౌతమి నాయక్ గతంలో ఉమెన్స్ మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ (women Maharashtra premier league) లో అద్భుతంగా ఆడింది. గతంలో స్మృతి మందానతో డ్రెస్సింగ్ రూమ్ కూడా పంచుకుంది. నవంబర్లో జరిగిన మేఘవేలంలో గౌతమి నాయక్ ను బెంగళూరు జట్టు పది లక్షలకు కొనుగోలు చేసింది..
మహారాష్ట్ర ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గౌతమి నాయక్ ఆర్ ఇన్నింగ్స్ లలో 133.8 స్ట్రైక్ రేట్ తో 173 పరుగులు చేసింది. ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన మూడవ ప్లేయర్ గా నిలిచింది. ఇందులో ఒక ఆప్ సెంచరీ కూడా ఉంది. 2025 లో సీనియర్ మహిళలు టి20 గెలుచుకున్నారు. ఆ సమయంలో ఆమె టీమ్ ఇండియాలో ఒక సభ్యురాలు కూడా.
అండర్ 23లో మహారాష్ట్ర జట్టుకు గౌతమి నాయక్ ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆ తర్వాత నాగాలాండ్ జట్టుకు మారిపోయింది.. నాగాలాండ్ జట్టు తరపున గౌతమి ఆట తీరును కిరణ్ మోర్ పరిశీలించారు. ఆ తర్వాత ఆమెను ముంబై ఇండియన్స్ జట్టు తరుపున ట్రయల్స్ కు ఆహ్వానించారు. ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్లో బరోడా జట్టు తరుపున ఆడాలని సూచించారు. ఆమె బరోడా జట్టు తరుపున రెండు సంవత్సరాలపాటు వైట్ బాల్ ఫార్మాట్లో ఆడింది. ఇప్పుడు ఇక బెంగుళూరు జట్టు తరఫున ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతోంది.