Team India Captaincy:  ధోని కంటే కోహ్లి తోపు కానీ… భారత క్రికెట్ కెప్టెన్లలో విజయాల శాతం ఎవరికి ఎక్కువ..?

Team India Captaincy: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అభిమానులున్న క్రీడ క్రికెట్. భారత్ కూడా క్రికెట్ ఆటలో దూసుకుపోతుంది. 1932లో ప్రపంచ క్రికెట్ వేదికపైకి అడుగుపెట్టిన భారత్ టీం మొదటి కెప్టెన్ సీకె నాయుడు. ఆ తరువాత టీం ఇండియాకు ఇప్పటి వరకు ఎందరో కెప్టెన్లు భారత క్రికెట్ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని లాంటి కెప్టెన్లు ప్రపంచ కప్ ను గెలిచి భారత క్రికెట్ ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లారు. […]

Written By: NARESH, Updated On : November 6, 2021 1:35 pm
Follow us on

Team India Captaincy: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అభిమానులున్న క్రీడ క్రికెట్. భారత్ కూడా క్రికెట్ ఆటలో దూసుకుపోతుంది. 1932లో ప్రపంచ క్రికెట్ వేదికపైకి అడుగుపెట్టిన భారత్ టీం మొదటి కెప్టెన్ సీకె నాయుడు. ఆ తరువాత టీం ఇండియాకు ఇప్పటి వరకు ఎందరో కెప్టెన్లు భారత క్రికెట్ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని లాంటి కెప్టెన్లు ప్రపంచ కప్ ను గెలిచి భారత క్రికెట్ ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ఫార్మాట్ ఏదైనా భారత్ తన సత్తా చూపిస్తూ వస్తోంది. అయితే ఇటీవల ఇండియన్ క్రికెట్ టీంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన భారత్ -పాక్ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంతో కెప్టెన్ దే బాధ్యత అని అంటున్నారు. ఇంకొందరు క్రికెట్ ను భ్రష్టు పట్టిస్తున్నారని అంటున్నారు. అయితే ఇండియన్ క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మఖ్య సంఘటనల గురించి ఒకసారి తెలుసుకుందాం..

viraj kohli2 dhoni

క్రికెట్ ఆటలో ప్రధానమైనది వన్టే మ్యాచ్. 50 ఓవర్ల పరిమితితో ఆడే ఈ ఫార్మాట్ కు ఇప్పటి వరకు సీకే నాయుడు నుంచి విరాట్ కోహ్లి వరకు 25 మంది కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇప్పటి వరకు అత్యధికంగా ధోని 200 మ్యాచు లకు కెప్టెన్ గా వ్యవహరించారు. ఆ తరువాత గుండప్ప విశ్వనాథ్, సయ్యద్ కీర్మాణి, మోహందర్ అమర్ నాథ్, అనిల్ కుంబ్లేలు ఒక్కో మ్యాచ్ కు కెప్టెన్లుగా ఉన్నారు. భారత్ కు మొదటి ప్రపంచ కప్ తీసుకొచ్చిన కపిల్ దేవ్ 74 మ్యాచ్ లకు సారథ్యం వహించారు. వీటిలో 39 గెలుపొదారు. అజారుద్దీన్ 174 మ్యాచులకు కెప్టెన్సీగా ఉండగా ఇందులో 90 మ్యాచ్ లు భారత్ గెలుపొందింది.

క్రికెట్ దేవుడిగా పేరు పొందని సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ టీం కెప్టెన్ గా 73 మ్యాచ్ లకు సారధ్యం వహించారు. ఇక సౌరవ్ గంగూలీ 146, రాహుల్ ద్రావిడ్ 79 మ్యాచులు, సునీల్ గవాస్కర్ 37 మ్యాచ్ లకు కెప్టెన్సీగా వ్యవహరించారు.భారత్ కు రెండో ప్రపంచ కప్ తీసుకొచ్చిన మహేంద్ర సింగ్ ధోని 184 మ్యాచ్ లకు సారధ్యం వహించగా ఇదులో 110 విజయం సాధించాయి. మిగతావి ఓటమి చెందాయి.ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటి వరకు 95 మ్యాచులకు సారధ్యం వహించగా ఇందులో 65 గెలిచాయి. 27ఓడిపోగా ఒకటి టై, రెండింటిలో ఫలితం తేలలేదు. ఓవరాల్ గా ధోని సక్సెస్ రేటు 59.52 కన్నా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి విజయాల శాతం 70.43 శాతం అంటే అందరి కంటే ఎక్కువగానే ఉంది.

వన్డేమ్యాచ్ కు భిన్నంగా అందులో సగం ఓవర్లను నిర్ణయించి ఆడే టీ 20 ఫార్మాట్ కు విపరీత క్రేజ్ ఉంది. ఈ ఫార్మాట్ కు ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే కెప్టెన్లుగా వ్యహరించారు. 2007 నుంచి 2016 వరకు మహేంద్ర సింగ్ ధోనీ ఉండగా.. ఈ కాలంలో 72 మ్యాచ్ లకు సారథ్యం వహించాడు. ఇందులో 41 మ్యాచుల్లో గెలుపొంది 28 మ్యాచుల్లో ఓడిపోయారు. టీ 20 ఫార్మాట్ లో ధోని విజయాల శాతం 59.28 గా ఉంది. 2017 నుంచి కెప్టెన్ గా ఉంటున్న విరాట్ కోహ్లి ఐదేళ్లలో 48 మ్యాచులకు కెప్టెన్ గా ఉన్నారు. ఇందులో 28 గెలుపొంది 16 ఓటమి చెందారు. మొత్తంగా కోహ్లి విజయాల శాతం 63.04గా ఉంది. అంటే ఇందులోనూ  ధోని కంటే విరాట్ కోహ్లి విజయాల శాతం ఎక్కువగానే ఉంది.

అన్ని మ్యాచుల్లో కోహ్లి విజయాల శాతం అత్యధికంగానే ఉన్నా ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేకపోయాడన్న అపవాదు ఉంది. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ లోనూ కోహ్లి తన ప్రతిభను చూపించలేకపోయాడు. తాజాగా జరుగుతన్న వరల్డ్ టీ 20 ప్రపంచ కప్ లో సెమీ ఫైనల్ చేరే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరగకపోతే టీం ఇంటిబాట పట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.