Virat Kohli: భారత్ కెప్టెన్ గా విరాట్ కోహ్లి ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నా ఈ మధ్య వెనుకబడిపోయారు. సెంచరీలు బాదడంలో ఉత్సాహం చూపించిన కోహ్లి గత రెండేళ్లుగా సెంచరీలు నమోదు చేయడం లేదు. దీంతో అతడిపై విమర్శలు పెరిగిపోయాయి. దీంతో టీ20, వన్డే కెప్టెన్ గా తొలగించారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రదర్శనపై కొన్ని రోజులుగా అనుమానాలు వస్తున్నాయి. అతడి బలం ఏమైందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాట్ తో మ్యాజిక్ లు చేసే కోహ్లి ఇటీవల ఎందుకో చేయలేకపోతున్నాడు. ఫలితంగా విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.
క్రీజులో కుదురుకుంటే ఎంతటి స్టార్ బౌలర్ నైనా ధీటుగా ఎదుర్కొనే కోహ్లి రికార్డుల పరంగా ఎన్నో ప్రత్యేకతలు సాధించినా ఇటీవల కాలంలో ఇప్పుడు మాత్రం తన పంథా మారినట్లు కనిపిస్తోంది. విజయాల పరంపర కొనసాగింపు లేకపోవడంతో బీసీసీఐ కెప్టెన్ గా తప్పించిందింది. రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించింది.
Also Read: సరికొత్త ఆశలతో 2022 ఇండియన్ క్రికెట్.. ఇక విజయాలే..
గత ఏడాది టెస్ట్ క్రికెట్ లో 10 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి ఒక్క సెంచరీ కూడా సాధించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో మొత్తం 11 మ్యాచుల్లో 28.21 సగటుతో 536 పరుగులు చేయడం గమనార్హం. దీంతో పరుగుల వరద పారించే కోహ్లి ప్రస్తుతం మాత్రం ఆ దూకుడు ప్రదర్శించలేకపోతున్నాడు. దీంతో అతడి కెరీర్ మీద ప్రభావం పడింది. కెప్టెన్ గా దూరం కావడం తెలిసిందే.
2019 నవంబర్ లో బంగ్లాదేశ్ తో కోల్ కతా వేదికగా జరిగిన టెస్ట్ లో చివరి సెంచరీ సాధించిన కోహ్లి తరువాత మరో శతకం ఇప్పటివరకు నమోదు చేయలేదు. ఇంతటి వైఫల్యానికి కారణమైన 2020, 2021 సంవత్సరాల్లో ఒక్క శతకం కూడా బాదలేదు. దీంతో అతడి వైఫల్యానికి కారణాలు అనేకం ఉన్నాయి. కవర్ డ్రైవ్ లన కవర్ చేస్తూ దొరికిపోతున్నాడని తెలుస్తోంది. ఇంతటి దారుణ వైఫల్యానికి గురైన విరాట్ సెంచరీలు సాధించడంలో విఫలమవడంతోనే విమర్శల పాలు అవుతున్నాడని తెలుస్తోంది.
Also Read: భారత వన్డే జట్టు ప్రకటన.. రోహిత్ కాదు.. కేఎల్ రాహుల్ కెప్టెన్.. వీరికి ఛాన్స్ కు గల కారణాలివీ