Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సమరం కొద్ది రోజుల్లో ప్రారంభ కాబోతోంది. దీనికి గాను ఇప్పటికే ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్నాయి. ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను వేలంలో దక్కించుకున్నాయి. అన్ని ఫ్రాంచైజీలు మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేస్తే హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం ఎందుకు పనికి రాని వారిని తీసుకుని అప్రదిష్ట మూటగట్టుకుంది. దీంతో అందరిలో నవ్వుల పాలు అయింది. తక్కువ ధరకే వచ్చే ఆటగాళ్లకు ఎక్కువ డబ్బులు పెట్టి మరీ కొనుగోలు చేసింది. టాలెంట్ ఉన్న వారిని మాత్రం తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో అభిమానుల్లో ఆగ్రహం వస్తోంది.

గతంలో కూడా ఇలాగే చేసి పరాజయాలు మూటగట్టుకున్న సన్ రైజర్స్ ఇప్పుడు కూడా అదే తప్పు చేసి పిసినారి ఫ్రాంచైజీగా పేరు తెచ్చుకుంది. కానీ ఆటగాళ్ల ఎంపికలో ఎలాంటి ప్రామాణికత పాటించిందో అర్థం కాలేదు. మొత్తానికి ప్రేక్షకులను మాత్రం నిరాశ మిగిల్చింది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ ఏమేరకు విజయం సాధిస్తుందో తెలియడం లేదు.
Also Read: భారీ ధరకు అమ్ముడు పోయిన లివింగ్‌స్టోన్.. ఫించ్, మోర్గాన్‌లకు పెద్ద షాక్..!
ఎక్కువ మంది ఆటగాళ్లను రూ.4 కోట్లకు సొంతం చేసుకున్నా వారిలో పనికి రాని వారే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. దీంతో మ్యాచుల్లో విజయం సాధించడం అంత సులభం కాదని తెలుస్తోంది. అసలు గెలుపు గుర్రాలను పక్కన పెట్టి ఎలాంటి ప్రభావం చూపని వారిని వేలంలో దక్కించుకోవడం విమర్శలకు తావిస్తోంది. సన్ రైజర్స్ తీరుతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

స్టార్ ఆటగాళ్లను వదిలేసి పనికి రాని వారిని రూ.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వాహకుల తీరుతో కొందరు ప్రశంసలు కూడా చేస్తుండటం గమనార్హం. కానీ వచ్చే సీజన్ లో సన్ రైజర్స్ మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే వాదనలు కూడా వస్తున్నాయి. మంచి ఆటగాళ్లను తీసుకుని విజయం దక్కించుకోవాలని భావించక తక్కువ ధరకు వస్తున్నారని బలహీనంగా ఉన్న వారిని తీసుకుని ఏం సాధిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి.
దీంతో సన్ రైజర్స్ పై సహజంగానే విమర్శలు పెరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో సన్ రైజర్స్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. వచ్చే సీజన్ లో ఎంత మేరకు విజయాలు సాధిస్తుందో తెలియడం లేదు. దీంతో ఆటగాళ్లు ఎలా తమ ప్రదర్శన చేస్తారో కూడా అంతుచిక్కడం లేదు.
Also Read: కొత్త ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న సమంత.. ఆమె ఎవరంటే..?