AP Minister Appalaraju: ఏపీలో మంత్రి అప్ప‌ల‌రాజుపై చ‌ర్య‌లు తీసుకోరా?

AP Minister Appalaraju: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మంత్రి అప్ప‌ల‌రాజు పోలీసుల‌పై తిట్టిన తిట్లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. రోజురోజుకు పోలీసు శాఖ‌కు గిట్ట‌డం లేదు. దీంతో పోలీసుల్లో ఆందోళ‌న నెల‌కొంది. కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో పోలీసుల్లో భ‌యం ప‌ట్టుకుంది. గ‌తంలో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నా చ‌ర్య‌లు మాత్రం తీసుకోలేదు. దీంతో ఈ సారి కూడా ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌మంజ‌సం కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.   ఉద్యోగుల‌పై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తే స‌హించ‌మ‌ని పోలీసులు […]

Written By: Srinivas, Updated On : February 13, 2022 5:03 pm
Follow us on

AP Minister Appalaraju: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మంత్రి అప్ప‌ల‌రాజు పోలీసుల‌పై తిట్టిన తిట్లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. రోజురోజుకు పోలీసు శాఖ‌కు గిట్ట‌డం లేదు. దీంతో పోలీసుల్లో ఆందోళ‌న నెల‌కొంది. కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో పోలీసుల్లో భ‌యం ప‌ట్టుకుంది. గ‌తంలో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నా చ‌ర్య‌లు మాత్రం తీసుకోలేదు. దీంతో ఈ సారి కూడా ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌మంజ‌సం కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

AP Minister Appalaraju

 

ఉద్యోగుల‌పై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తే స‌హించ‌మ‌ని పోలీసులు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే పోలీసు శాఖ ప‌రువు పోతున్న క్ర‌మంలో ప్ర‌భుత్వం ఏ మేర‌కు స‌హ‌క‌రిస్తుందో తెలియ‌డం లేదు. కానీ దీనిపై ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు. గ‌తంలో కూడా మంత్రి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి కూడా దూష‌ణ‌లు చేయ‌డంతో ఆయ‌న‌పై కూడా ప్ర‌భుత్వం మాత్రం చ‌ర్య‌లు తీసుకోవడానికి వెనుకాడింది. దీంతో ప్ర‌స్తుతం ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో అనే దానిపైనే అంద‌రికి అంచ‌నాలు ఉన్నా అవి నెర‌వేర‌డం లేదు.

Also Read: భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయిన లివింగ్‌స్టోన్‌.. ఫించ్‌, మోర్గాన్‌ల‌కు పెద్ద షాక్‌..!

మంత్రి అప్ప‌ల‌రాజు పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే విధులు నిర్వ‌హించ‌డం క‌ష్ట‌మే అని పోలీసులు చెబుతున్నారు. అటువైపు ప్ర‌భుత్వ‌మైతే మంత్రిపై చ‌ర్య‌ల‌కు ముందుకు రావ‌డం లేదు. దీంతో పోలీసుల ఆశ‌లు నెర‌వేర‌తాయో లేదో అనే సందేహాలు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల చ‌లో విజ‌య‌వాడ‌లో పోలీసుల స‌హకారంతోనే ఉద్యోగుల దీక్ష విజ‌యవంతం అయింద‌ని తెలుస్తోంది. దీంతో ప్ర‌భుత్వానికి ఎక్క‌డ వాత పెట్టాలో కూడా తెలుస్తుందని తెలిసినా ప్ర‌భుత్వం మాత్రం ఎందుకు ముందుకు రావ‌డం లేదో అర్థం కావ‌డం లేదో తెలియ‌డం లేద‌నే వాద‌న‌లు వ‌స్తున్నాయి.

AP Minister Appalaraju

ఈ నేప‌థ్యంలో పోలీసుల ఇగో దెబ్బ‌తిన‌డంతో వారు స‌రిగా విధులు నిర్వ‌హించ‌లేక‌పోతున్నారు. త‌మ‌ను ఎవ‌రు ప‌డితే వారు ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిడితే ప‌డి ఉండ‌టానికి తమ‌కు కూడా ఆత్మాభిమానం లేదా అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వ విధులు నిర్వ‌హించినంత మాత్రాన మంత్రులు తిడితే ప‌డి ఉండాలా అని ఎదురు తిరుగుతున్నారు. ప్ర‌భుత్వానికి స‌రైన స‌మ‌యంలో గుణ‌పాఠం చెబుతామ‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌మ స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోని ప్ర‌భుత్వానికి తామెందుకు సేవ‌లు చేయాల‌ని అంటున్నారు.

మొత్తానికి మంత్రి అప్ప‌లరాజు వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వ తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మంత్రిని క‌నీసం ప‌ల్లెత్తు మాట కూడా అన‌కుండా మౌనంగా ఉండ‌టంలో ఆంత‌ర్య‌మేమిటో అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టికైనా మంత్రి అప్ప‌ల‌రాజుపై చ‌ర్య‌లు తీసుకుని పోలీసుల ఆత్మాభిమానాన్ని కాపాడాల‌ని కోరుతున్నారు.

Also Read:  కొత్త ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న‌ స‌మంత‌.. ఆమె ఎవ‌రంటే..?

Tags