India Vs South Africa Series: సౌతాఫ్రికా సీరీస్ కి దూరం అయిన ఆ స్టార్ పేసర్ కారణం ఏంటంటే..?

బ్యాట్స్ మెన్స్ ని కూడా తను వేసే బాల్స్ తో చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలా తను చాలా మంచి బౌలర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.

Written By: Gopi, Updated On : December 6, 2023 12:47 pm

India Vs South Africa Series

Follow us on

India Vs South Africa Series: క్రికెట్లో చాలామంది ప్లేయర్లు బ్యాట్ తో గానీ లేదా బాల్ తో గానీ అద్భుతాలను చేస్తూ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వాళ్లలో దీపక్ చాహర్ ఒకరు. ఈయన ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం తరఫున ఆడుతూ తనదైన రీతిలో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడంలో దిట్టా…

అలాగే బ్యాట్స్ మెన్స్ ని కూడా తను వేసే బాల్స్ తో చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలా తను చాలా మంచి బౌలర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లే లో తనదైన రీతిలో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయగల సత్తా ఉన్న ఇండియన్ బౌలర్లలో ఈయన ముందు వరుసలో ఉంటాడు. అయితే ఆస్ట్రేలియాతో ఆడిన టి20 సిరీస్ లో 4వ టి20 మ్యాచ్ లో తనదైన రీతిలో బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి బౌలింగ్ లో తన సత్తా చాటుకున్నాడు. ఇక ఐదోవ మ్యాచ్ కి తను అందుబాటులో లేడు. అయిన కూడా ఇండియన్ టీమ్ ఐదోవ మ్యాచ్ లో కూడా విజయం సాధించి 4-1 తేడా తో సీరీస్ ని కైవసం చేసుకుంది. ఇక దీపక్ చాహార్ సౌతాఫ్రికా సిరీస్ కోసం టి20 మ్యాచ్ లకి సెలెక్ట్ అయినప్పటికీ వాళ్ళ నాన్నకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల తను ఈ సౌతాఫ్రికా సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టుగా అధికారికంగా ప్రకటించాడు.

ఎందుకు అంటే వాళ్ళ నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్ తీసుకెళ్ళారు ప్రస్తుతం హెల్త్ కండిషన్ నార్మల్ గా ఉన్నప్పటికీ ఆయన్ని కరెక్ట్ టైం కి హాస్పిటల్ కి తీసుకెళ్ళారు కాబట్టి బతికారు లేకపోతే మాత్రం సిచువేషన్ వేరేగా ఉండేది అంటూ తను కొంచెం ఎమోషనల్ అయినట్టు గా తెలుస్తుంది. అలాగే ఈ సిచువేషన్ లో వాళ్ళ నాన్నకి ఆయన తోడు గా ఉండడం చాలా అవసరం అంటూ బిసిసిఐ గాని, కోచ్ రాహుల్ ద్రావిడ్ కి గాని సెలక్టర్లు కి గానీ తన ప్రాబ్లం చెప్పాడు. ఇక వాళ్ల నాన్న గురించి తెలియజేస్తూ నేను క్రికెట్ ఆడటానికి మా నాన్న పడిన కష్టం ఏంటో నాకు తెలుసు ఇలాంటి సమయం లో మా నాన్న పక్కన నేను ఉండకపోతే అది నేను చేసిన పెద్ద మోసం అవుతుంది అంటూ తను వాళ్ళ నాన్న గురించి వాళ్ళ నాన్న పడిన కష్టం గురించి చాలా గొప్పగా చెప్పాడు.దీంతో దీపక్ సార్ ప్లేస్ లోకి మరో పేస్ బౌలర్ ని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి…

అయితే చాలామంది ఏమనుకున్నారు అంటే దీపక్ చాహర్ టీమ్ లో ఉంటే సౌతాఫ్రికా తో ఆడే మ్యాచుల్లో ఆయన బాల్ బాగా స్వింగ్ అవుతుంది కాబట్టి సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ ని ఇబ్బంది పెట్టి వికెట్లు తొందరగా తీస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలు తలకిందులు చేస్తూ తను సిరీస్ నుంచి తప్పుకోవడం అనేది బ్యాడ్ విషయం అనే చెప్పాలి..