Under 19 World Cup: టీమిండియా అండర్ -19 ప్రపంచ కప్ సొంతం చేసుకోవడం తెలిసిందే. వరుసగా ఐదో సారి కప్ గెలుచుకోవడంపై అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. ఆటగాళ్ల సమష్టి రాణింపుతో విజయం సొంతం చేసుకోవడం గమనార్హం. ఒక దశలో ఆటగాళ్లు కరోనా బారిన పడుతున్నా వారిలో ఆత్మస్థైర్యం తగ్గలేదు. పట్టుదల కూడా పెరిగింది. కసితో ఆడారు. ప్రత్యర్థిని చిత్తు చేశారు. కప్ గెలుచుకుని విమర్శల నోటికి తాళం వేశారు. ఫైనల్ లో ఒత్తిడి తలొగ్గకుండా తమదైన శైలిలో ఆడుతూ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ యువ భారత్ జయకేతనం ఎగురవేయడం సంచలనం కలిగించింది.

కఠిన సవాళ్లను ఎదుర్కొని విజయతీరాలకు చేరారు. ఒక దశలో ఐర్లాండ్ తో మ్యాచ్ లో పదిమంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నా వారిలో భయం ఏమాత్రం చోటుచేసుకోలేదు. కెప్టెన్ యశ్ ధూల్, వైస్ కెప్టెన్ రషీద్ లు రాణించి జట్టును ఆదుకున్నారు. దీంతో భారత జట్టు విజయపథంలో దూసుకుపోయింది. ఐర్లండ్ తో మ్యాచ్ లో కెప్టెన్ కరోనా బారిన పడటంతో ఆటగాళ్లు ఎంతకూ వెనుకంజ వేయలేదు.
దీంతో జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, హెడ్ కోచ్ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపి ఓటమి బారిన పడకుండా చూశారు. దీంతో టీమిండియా విజయాల పరంపర కొనసాగింది. నిషాంత్ సిధూను కెప్టెన్ గా నియమించి వారిని ముందుకు నడిపించారు. దీంతో వారికి ఎలాంటి ఒత్తిడి తలొగ్గకుండా విజయం సొంతం చేసుకున్నారు. భారత్ విజయాలకు అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇప్పటికి సీనియర్ ఆటగాళ్లు రెండు సార్లు మాత్రమే కప్ గెలుచుకోగా జూనియర్లు మాత్రం అయిదు సార్లు కప్ వరుసగా గెలుచుకోవడం తెలిసిందే. దీంతో వచ్చే వరల్డ్ కప్ లో ఆటగాళ్లు రాణించి మరోమారు కప్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సీనియర్ జట్టు విజయాలు నమోదు చేసి ప్రేక్షకుల కోరిక తీర్చాలని ఆశిస్తున్నారు. దీనికి ఇప్పటి నుంచి కసరత్తు చేయాలని భావిస్తున్నారు.