Champions Trophy 2025 : భారత్ గ్రూపు ఏ లో ఉంది. ఇందులో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. వన్డే ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ఇందులో ఒక మ్యాచ్ లో ఓడిపోయినా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారిపోతాయి. ఒకవేళ భారీ ఓటమి ఎదురైతే ఇంటి ముఖం పట్టాల్సిందే. 2022లో జరిగిన ఆసియా కప్ లో భారత్ గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. కేవలం ఒకే ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. సెమీస్ వెళ్లకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. భారత్ ఎలాంటి కష్టాలు లేకుండా సెమీస్ వెళ్లాలంటే కచ్చితంగా మూడు మ్యాచ్లు గెలవాలి. భారత్ ఆడే మ్యాచ్ లు మొత్తం దుబాయ్ లో జరుగుతాయి.. ఈ మైదానంలో పరిస్థితులు భారత దేశాన్ని పోలినట్టు ఉంటాయి. అందువల్లే టీమిండియా మేనేజ్మెంట్ ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.
బంగ్లాతో కాస్త జాగ్రత్త
బంగ్లాదేశ్ తో భారత జట్టు (IND vs BAN) ఛాంపియన్స్ ట్రోఫీలో తన తొలి మ్యాచ్ ఆడుతుంది. ఫిబ్రవరి 20న ఈ మ్యాచ్ జరుగుతుంది. వాస్తవానికి టీం ఇండియా ఏమైనా గ్రూపులో బలహీనమైన జట్టు బంగ్లాదేశే. అయితే ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయవద్దు. 2007లో జరిగిన ప్రపంచకప్ లో భారత జట్టుకు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దు. అయితే ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసుకుంటే భారత జట్టు బంగ్లాదేశ్ జట్టుపై గెలవడం పెద్ద కష్టం కాదు.. గత ఆరు వన్డేలలో బంగ్లాదేశ్ ఐదింటిలో ఓడిపోయింది.. కొద్దిరోజులుగా ఆ జట్టు ప్లేయర్లకు 50 ఓవర్ల క్రికెట్ ప్రాక్టీస్ కూడా లేకుండా పోయింది.. వారంతా కూడా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) నుంచి బయటకి వచ్చినవారే. బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షాంటో, ముస్తాఫిజుర్, ముష్ఫికర్ రహీం మీదే ఎక్కువ ఆధారపడింది. దుబాయ్ మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలమైన నేపథ్యంలో స్పిన్నర్ రిషబ్ ప్రభావం చూపిస్తాడని బంగ్లాదేశ్ జట్టు భావిస్తోంది. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్లో ప్రభావం చూపిస్తే సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. బంగ్లా కూడా అదే లక్ష్యంతో ఆడుతుంది కాబట్టి.. పోటీ హోరాహోరీగా ఉంటుందని తెలుస్తోంది.
పాక్ తో మ్యాచ్.. అప్రమత్తంగా ఉండాల్సిందే
పాకిస్తాన్ జట్టుతో భారత్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది.. ఫిబ్రవరి 23న భారత్ – పాకిస్తాన్ ( IND vs PAK) తల పడుతున్నాయి.. ఆతిథ్య హోదాలో పాకిస్తాన్ జట్టు రంగంలోకి దిగుతోంది.. కేవలం భారత్ తో జరిగే మ్యాచ్ మాత్రమే పాకిస్తాన్ దుబాయ్ లో తలపడుతుంది. మిగతా మ్యాచ్లను సొంత మైదానంలో ఆడుతుంది. ట్రై సిరీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఫైనల్ లో పాకిస్తాన్ ఓటమిపాలైంది. గత మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ అద్భుతంగా ఆడింది.. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత జట్టుపై పాకిస్తాన్ (IND vs PAK) విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ ఇండియా భావిస్తుంది. పాక్ జట్టులో మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా సూపర్ ఫామ్ లో ఉన్నారు. స్టార్ ఆటగాడు బాబర్ ఆజాం సరిగా పరుగులు తీయలేకపోతున్నాడు. యువ ఆటగాడు సయీమ్ ఆయుబ్ గాయం వల్ల ఇబ్బంది పడుతున్నాడు. టోర్నీ నుంచి నిష్క్రమించాడు.. బుమ్రా లేకపోవడం టీమిండియా కు చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా. ఇక పాకిస్తాన్ పేస్ త్రయం షహీన్, రౌఫ్, నసీం తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. స్పిన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ నుంచి ఇబ్బంది తప్పదని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రమాదకరమైన న్యూజిలాండ్
ఐసీసీ టోర్నీలు అనగానే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే జట్లలో న్యూజిలాండ్ ( IND vs NZ) ఒకటి . ఈసారి కూడా న్యూజిలాండ్ నుంచి భారత జట్టుకు కఠినమైన సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. న్యూజిలాండ్ లో ప్రధాన ఆటగాళ్లు కాన్వే, టామ్ లాతమ్, కేన్ విలియంసన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వంటి ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. తాజాగా పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో జరిగిన ట్రై సిరీస్ ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో ఏకంగా పాకిస్తాన్ జట్టను ఓడించింది.. సౌథి, ట్రెంట్ బౌల్ట్, లాకీ పెర్గూసన్ లేకపోవడంతో న్యూజిలాండ్ పేస్ విభాగం కాస్త బలహీనంగా ఉంది.. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నుంచి టీమ్ ఇండియాకు ఇబ్బంది తప్పదు. గత ఏడాది భారత మైదానాలపైనే సాంట్నర్ దూకుడు కొనసాగించాడు. ఇక ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర తలకు బలమైన గాయం అయింది. అతని రాకపై ఇంకా సందిగ్ధత తొలగలేదు. న్యూజిలాండ్ ( IND vs NZ) బౌలింగ్ తో పోల్చితే బ్యాటింగ్ బలంగా ఉంది. అది భారత జట్టుకు కాస్త ఇబ్బందికరంగా మారనుంది.