Indian players do after winning against Pakistan
Ind vs Pak : పాకిస్తాన్ పై గెలిచాక టీమిండియా క్రికెటర్లు చిల్ అయ్యారు. ఫుల్ జోష్ లో సరదాగా ఈత కొట్టారు. పాక్ తో మ్యాచ్ లో ఏకంగా 230 పరుగులకు పైగా తేడాతో గెలవడంతో జోష్ లో హోటల్ కు వెళ్లిన క్రికెటర్లు స్విమ్మింగ్ ఫూల్ లో సేదతీరుతూ చిల్ అయ్యారు. తద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందామని రోహిత్ శర్మ తెలిపారు.
పాక్ తో హైఓల్టేజ్ మ్యాచ్ తర్వాత హోటల్ కు వెళ్లగానే రోహిత్, కోహ్లీ, రాహుల్, సూర్య, పాండ్యా, గిల్ లు స్విమ్మింగ్ పూల్ లో గడిపారు. సరదాగా గడిపారు.
అనంతరం పడుకొని ఈరోజు మళ్లీ శ్రీలంకతో మ్యాచ్ కు రెడీ అయ్యారు. పాకిస్తాన్ పై చిత్తక్కొట్టిన భారత బ్యాటర్లు శ్రీలంకపై మాత్రం ఆచితూచి ఆడారు. స్పిన్ వికెట్ పై తడబడ్డారు. తక్కువ పరుగులే చేశారు. అదే పిచ్ పై శ్రీలంక గెలుపు కోసం చివరిదాకా పోరాడింది. కానీ మన బౌలర్లు సమష్టిగా బౌలింగ్ చేసి అతికష్టం మీద లంకను ఓడించారు.
A memorable victory followed by a much-deserved recovery session ahead of today's Super 4s encounter
Here's a quick round-up of #TeamIndia's remarkable win over Pakistan in Colombo #AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/h0n4yeIZbN
— BCCI (@BCCI) September 12, 2023