West Indies Vs India 1st Test: వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగిపోయాడు. పూనకం వచ్చిన వాడిలా బంతిని గిరగిరా తిప్పేశాడు. అశ్విన్ మాయాజాలాన్ని తట్టుకోలేక వెస్టిండీస్ బ్యాటర్లు విలవిల్లాడారు. అద్భుతమైన ప్రదర్శన చేసిన అశ్విన్ 5 వికెట్లతో చెలరేగడంతో వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన సత్తాను చాటాడు. అశ్విన్ మెలికలు తిరిగే బంతులకు వెస్టిండీస్ బ్యాటర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. దీంతో వెస్టిండీస్ జట్టు నామమాత్రపు స్కోరు కే చతికిల పడిపోయింది. తొలి రోజే వెస్టిండీస్ జట్టును భారత చుట్టేయడంతో ఈ టెస్ట్ ఆసక్తికరంగా సాగే అవకాశం లేదనిపిస్తోంది.
తిప్పేసిన రవిచంద్రన్ అశ్విన్..
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విని తిప్పేశాడు. డొమినికా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు యంగ్ ప్లేయర్ టిగ నరైన్ చంద్రపాల్ (12) వికెట్ తీసిన రవిచంద్రన్ అశ్విన్ భారత్ కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా అశ్విన్ తోపాటు భారత బౌలర్లు జోరు కొనసాగించారు. పిచ్ నుంచి కూడా ఆశించిన స్థాయిలో సహకారం లభించడంతో అశ్విన్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్ లో అశ్విన్ బ్రాత్ వైట్, చంద్రపాల్, అలీక్ అతాంజే, అల్జారి జోసెఫ్, వర్రీ కాన్ వికెట్లను వెస్టిండీస్ జట్టు పడగొట్టి పతనాన్ని అశ్విన్ శాసించాడు.