Allu Arjun: మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంచలంచలుగా ఎదుగుతూ నేడు ఏ స్తాయోయికి చేరుకున్నాడో మన అందరికీ తెలిసిందేహిట్లు , ఇండస్ట్రీ హిట్లు అందుకొని తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని సంపాదించాడు. ఇక రీసెంట్ గానే పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో రికార్డ్స్ మొత్తం కొల్లగొట్టి , ఇతర రాష్ట్రాలలో రాజమౌళి తర్వాత తనదే పెద్ద బ్రాండ్ అని నిరూపించుకున్నాడు.
ప్రస్తుతం ఆయన రేంజ్ అలా ఉంది. అయితే రీసెంట్ గా ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ మీద రూమర్స్ ఒక రేంజ్ లో ప్రచారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. స్టార్ స్టేటస్ పెరిగే కొద్దీ రూమర్స్ కూడా పెరుగుతాయని అందరూ అంటుంటారు, అల్లు అర్జున్ ని చూస్తే అది నిజమేనేమో అని అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ తో దూరంగా ఉంటున్నాడు అని గత కొంతకాలం గా సోషల్ మీడియా లో రూమర్స్ ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని అల్లు అర్జున్ ఎన్నో సందర్భాలలో మెగా ఫ్యామిలీ తో ఆప్యాయంగా కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసాడు. అదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ గురించి లేటెస్ట్ గా ఒక రూమర్ సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారి అభిమానులను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. అదేమిటంటే అల్లు అర్జున్ ఈమధ్య తన ఫామ్ హౌస్ లో కుటుంబం తో కలిసి అర్థ రాత్రులు పూజలు చెయ్యిస్తున్నాడట.
అందుకు కారణం రీసెంట్ గా తనకి ఒక ప్రముఖ జ్యోతిష్యుడు నీ జాతకం లో కొన్ని దోషాలు ఉన్నాయని, పరిహార పూజలు చేయించకపోతే చాలా గడ్డు కాలం ఎదురుకుంటావని, పరిహారం చేయిస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఏలే రేంజ్ కి ఎదుగుతావని చెప్పాడట. ఇక అప్పటి నుండి అల్లు అర్జున్ జ్యోతిష్యుడు చెప్పినట్టుగానే అర్థ రాత్రి ఫామ్ హౌస్ లో పూజలు చెయ్యిస్తున్నదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఈ పూజలో ఆయన భార్య పిల్లలతో పాటుగా, తల్లి కూడా పాల్గొంటుందని సమాచారం.