Homeక్రీడలుBCCI - West Indies Tour : వెస్టిండీస్  టూర్.. సీనియర్లకు బీసీసీఐ షాక్.. కెప్టెన్...

BCCI – West Indies Tour : వెస్టిండీస్  టూర్.. సీనియర్లకు బీసీసీఐ షాక్.. కెప్టెన్ ఎవరంటే?

BCCI – West Indies Tour : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి తర్వాత అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున జట్టు విమర్శలను ఎదుర్కొంటోంది. అదే సమయంలో బిసిసిఐపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దేశం కోసం బలమైన జట్టును ఎంపిక చేయకపోవడం వల్లే కీలక టోర్నీల్లో భారత ఆటగాళ్లు చేతులెత్తేస్తున్నారు అంటూ మాజీ ఆటగాళ్లు, అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటిసి ఫైనల్ తర్వాత భారత జట్టు సుమారు నెల రోజులపాటు విశ్రాంతి తీసుకుని వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అయితే, ఈ పర్యటనకు వెళ్లే భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.

భారత జట్టు వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమవుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో దక్కిన ఓటమి నుంచి బయట పడేందుకు ఈ సిరీస్ భారత జట్టుకు ఉపయోగపడుతుందని అంతా భావిస్తున్నారు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్ లు ఆడనుంది. అయితే, ఈ పర్యటనలోని టెస్ట్ సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ దూరంగా ఉంటారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం వెనక డబ్ల్యూటిసి ఫైనల్ ఓటమి బలమైన కారణంగా కనిపిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
విశ్రాంతినివ్వాలని యోచిస్తున్న బీసీసీఐ.. 
భారత జట్టు గత కొన్నేళ్లు నుంచి ఎడతెరిపి లేకుండా క్రికెట్ ఆడుతోంది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతి లేకపోవడంతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. ఒత్తిడితో కూడిన క్రికెట్ వల్ల వారి ఫామ్ పై ప్రభావం పడుతోంది. దీంతో ఆశించిన స్థాయిలో కీలక ఆటగాళ్లు రాణించలేకపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ స్టార్ ఆటగాళ్లకు ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించే యోచనలో కనిపిస్తోంది. ఇప్పటికే టి20 ఫార్మాట్ కు హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ జట్టును బీసీసీఐ సిద్ధం చేసింది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లు అందరిని ఈ ఒక్క ఫార్మాట్ పరిమితం చేసి ఎక్కువ మ్యాచ్ లు ఆడించాలన్న ఆలోచనను బీసీసీఐ చేస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే బీసీసీఐ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
జట్టును నడిపించనున్న అజంక్య రహానే..
వెస్టిండిస్ పర్యటనకు వెళుతున్న భారత జట్టులోని సీనియర్ అటుగాళ్లకు కొంత భాగమైన విశ్రాంతిని కల్పించాలని బిసిసిఐ భావిస్తోంది. ఇప్పటికే చాలా మంది సీనియర్ ఆటగాళ్లు అలసటగా కనిపిస్తుండడంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టెస్ట్ లేదా పరిమితి ఓవర్ల సిరీస్ లకు సీనియర్లకు రెస్టు ఇవ్వాలని, దీనిపై ఆటగాళ్లతో చర్చించాకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. సీనియర్ల గైర్హాజరీలో జట్టును రహానే నడిపించనున్నాడు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ టెస్టుల్లోకి ఆరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది. డబ్ల్యూటిసి ఫైనల్ లో ఫెయిల్ అయిన ఉమేష్ యాదవ్, పుజారాలపై కూడా వేటు పడే అవకాశం కనిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన జట్టు వివరాలను ఈ నెల 27న బీసీసీఐ విడుదల చేయనున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు..
సుబ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు సాంసన్, రహానే, ఇషాన్ కిషన్, కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, జయదేవ్ ఉనాడ్కత్, శార్దూల్ ఠాకూర్, అర్షదీర సింగ్, ఉమ్రాన్ మాలిక్.
RELATED ARTICLES

Most Popular