https://oktelugu.com/

Shamar Joseph: వేలు విరిగినా సరే.. లాస్ట్ వికెట్ పడే వరకూ బౌలింగ్ చేస్తానన్నాడు

ఈ మ్యాచ్ లో 7 వికెట్లు తీసి వెస్టిండీస్ టీమ్ ను విజయ తీరాలకు చేర్చాడు. అయితే ఈ మ్యాచ్ మొత్తం ముగిసిన తర్వాత శమీర్ జోసఫ్ బ్రాడ్ కాస్టర్ తో మాట్లాడుతూ 'నేను గ్రౌండ్ లోకి మళ్ళీ వచ్చాను అంటే దానికి మా డాక్టర్ చేసిన చికిత్స వల్లనే మైదానంలోకి రాగలిగాను.

Written By:
  • Gopi
  • , Updated On : January 29, 2024 11:43 am
    Shamar Joseph raises the ball after taking 7 wickets
    Follow us on

    Shamar Joseph: బ్రిస్బేన్‌ లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ విజయం లో వెస్టిండీస్ ప్లేయర్ అయిన శమీర్ జోసఫ్ కీలక పాత్ర వహించాడు. కేవలం 68 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. నిజానికి ఆయన కాలి బొటన వేలు విరిగింది. దాంతో ఆయన రెస్ట్ తీసుకోవాలని టీమ్ మెంబర్స్ అందరూ భావించారు. కానీ ఆయన ఏ మాత్రం తడబడకుండా వెస్టిండీస్ కి విజయాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు కదిలాడు.

    ఇక ఈ మ్యాచ్ లో 7 వికెట్లు తీసి వెస్టిండీస్ టీమ్ ను విజయ తీరాలకు చేర్చాడు. అయితే ఈ మ్యాచ్ మొత్తం ముగిసిన తర్వాత శమీర్ జోసఫ్ బ్రాడ్ కాస్టర్ తో మాట్లాడుతూ ‘నేను గ్రౌండ్ లోకి మళ్ళీ వచ్చాను అంటే దానికి మా డాక్టర్ చేసిన చికిత్స వల్లనే మైదానంలోకి రాగలిగాను. ఆయన నా కాలి బొటనవేలుకి ఏదో చేసాడు ఏం చేశాడో తెలియదు గానీ నేను మ్యాచ్ మాత్రం ఆడాలి అని చెప్పడంతో బొటనవేలుకు ఏదో చికిత్స చేసి నన్ను మైదానంలోకి పంపించాడు’. ఇక అప్పుడు నేను చేయాల్సిన న్యాయం ఏంటి అని ఆలోచించా, గెలుపు ఒక్కటే మనం మన టీమ్ కి ఇచ్చే గౌరవం అని భావించి గెలవాలనే దిశగా బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశా.

    ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్స్ ని పెవిలియన్ పంపించాలి అనుకున్న , అందులో సక్సెస్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయంలో డాక్టర్ ను కూడా గౌరవించాలి అంటూ డాక్టర్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు.1997 తర్వాత ఆస్ట్రేలియాలో వెస్టిండీస్ మొదటి సారి టెస్ట్ మ్యాచ్ లో గెలిచింది. అలాగే 2003 తర్వాత ఆస్ట్రేలియా మీద మొదటి టెస్ట్ మ్యాచ్ వెస్టిండీస్ గెలిచింది.

    ఈ సిరీస్ ని 1-1తో సమం చేసిన కూడా మేం గెలిచినట్టుగానే భావిస్తున్నా అంటూ శమీర్ జోసఫ్ తెలియజేశాడు. అలాగే తను గ్రౌండ్ లోకి వచ్చినప్పుడు ఆస్ట్రేలియన్ టీమ్ ఇంకా 156 పరుగులు చేయాల్సి ఉండగా, టీమ్ లో చివరి వరకు తనని కొనసాగించాలని తమ కెప్టెన్ అయిన బ్రాత్ వైట్ తో చెప్పానని చివరి బంతి వరకు నేను బౌలింగ్ చేస్తాను, నన్ను ఎవరు ఆపకండి అని చాలా స్పష్టంగా తెలియజేశాడట. ఇక ఇది చూసిన చాలా మంది తన పోరాట పటిమ నే వెస్టిండీస్ కి విజయాన్ని అందించింది అంటూ జోసఫ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు…