Australian cricket team: ఏ దేశమైనా సరే.. తమ ప్రాంతానికి ఇతర దేశాలకు చెందిన క్రీడాకారులు వస్తే గౌరవిస్తుంది. వారికి సరైన స్థాయిలో వసతి కల్పించి ఆతిథ్యం ఇస్తుంది. పైగా వారిని అత్యంత గౌరవంగా చూసుకుంటుంది. వారు ప్రయాణించే వాహనాల్లో కూడా అత్యంత ఆధునికమైన సదుపాయాలను కల్పిస్తుంది. ఎందుకంటే అతిధి దేవోభవ అనేది తప్పనిసరిగా పాటించాల్సిన సూక్తి.
కానీ ఈ విషయం పాకిస్తాన్ క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ కు అర్థం కావడం లేదు. పైగా ఆదేశంలో ఉగ్రవాదుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్ దేశంలో శ్రీలంక ఆటగాళ్లు ఆడేందుకు వచ్చారు. ఆ సమయంలో ఉగ్రవాదులు శ్రీలంక క్రికెటర్లను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. వెంట్రుక వాసిలో శ్రీలంక క్రికెటర్లు తప్పించుకున్నారు. లేకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఆ సంఘటన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు పాకిస్తాన్ దేశంలో ఏ జట్టు కూడా పర్యటించలేదు.
కొంతకాలంగా పాకిస్తాన్ దేశంలో అనేక జట్లు పర్యటిస్తున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్లో 3 t20 మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు వచ్చింది. ఈ సిరీస్ లో పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా కు 0 ఫలితాన్ని ఇచ్చింది. ఈ ఓటమిని ఆస్ట్రేలియా పెద్దగా పట్టించుకోలేదు. పైగా తమ దృష్టి మొత్తం టి20 వరల్డ్ కప్ మీద ఉందని ప్రకటించింది.
అయితే ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ దేశంలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. దాని ప్రభావం అన్ని రంగాల మీద ఉంది. దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మినహాయింపు కాదు. అయితే ఆస్ట్రేలియా క్రీడాకారులను హోటల్ కు తరలించే ప్రత్యేకమైన బస్సులు లేకపోవడంతో ఆటోలలో తీసుకెళ్లారట. ఆ ఆటోలకు పైకప్పు కూడా లేదట. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే వీటిని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఖండిస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ పరువు తీయడానికి కొంతమంది ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇటువంటి చిత్రాలను బయటపెడుతున్నారని.. ఇదంతా నిజం కాదని.. ఆస్ట్రేలియా క్రీడాకారులను అధునాతన సౌకర్యాలు ఉన్న బస్సులలో హోటల్ గదులు దాకా తీసుకెళ్లామని.. వారి భద్రతకు విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చామని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు చెబుతున్నారు.