Rohit Sharma: ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా దారుణంగా ఓడిపోయింది.నిజానికి ఈ మ్యాచ్ గెలిచినా, ఓడిపోయినా ఇండియా టీం కి పెద్దగా వచ్చే నష్టం ఏమి ఉండదు. కానీ ఈ మ్యాచ్ కూడా గెలిచి ఆస్ట్రేలియా ని వైట్ వాష్ చేస్తే చూసి సంతోషపడాలని చాలా మంది ఇండియన్ క్రికెట్ అభిమానులు మాత్రం చాలా ఉత్సాహంగా ఎదురుచూసారు.మొత్తానికి ఈ మ్యాచ్ ని ఓడిపోయిన కుడా మన ప్లేయర్లు టీం స్పిరిట్ ని చాటుకున్నారు.ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా చాలా బాగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లకి ఏడూ వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది.
ఇక వీళ్ల ఓపెనర్లు అయిన డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఇద్దరు కూడా మొదటి నుంచి చాలా దూకుడు గా ఆడుతూ ఆస్ట్రేలియా టీం భారీ స్కోర్ చేయడం లో కీలక పాత్ర వహించారు. ఇక దానికి తగ్గట్టు గానే ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ చేసి వాళ్ళ సత్తా చాటుకున్నారు.ఇక మార్ష్ మాత్రం 96 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ప్రసిద్ధి కృష్ణ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయి పోయాడు.ఇక వార్నర్ కూడా 56 పరుగులు చేసాడు.ఇక వీళ్ల తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ కూడా చాలా మంచి నాక్ ఆడి 61 బంతుల్లో 74 పరుగులు చేసాడు.ఇక ఆయన తర్వాత వచ్చిన లబుషెన్ కూడా ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ ని నమోదు చేసాడు. వీళ్ల్లు నలుగురు రాణించండం తో ఆస్ట్రేలియా 352 పరుగులు చేసింది.ఇక ఇండియన్ బౌలర్లు ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేయడం లో కొంతవరకు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. మన బౌలర్లలోబుమ్రా 3 వికెట్లు తీసాడు, అలాగే కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, ఇక సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ ఇద్దరు తలో వికెట్ తీసుకున్నారు…
ఇక 353 భారీ పరుగులు ఛేదించడమే లక్ష్యం గా ఇండియన్ బ్యాట్స్ మెన్స్ బరిలోకి దిగడం జరిగింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు గా రోహిత్ శర్మ, వాషింగ్ టన్ సుందర్ ఇద్దరు దిగారు. వాళ్లిద్దరూ కూడా టీం కి ఒక మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఇవ్వడం నిజంగా మంచి పరిణామం అనే చెప్పాలి.ఇక వీళ్లిద్దరు మొదటి వికెట్ కి 74
పరుగులు జోడించి ఒక వంతు కు ఇండియన్ టీం కి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఇచ్చారు.అయితే మొదటి నుంచి వాషింగ్ టన్ సుందర్ నిదానం గా ఆడగా,మరొక ఎండ్ లో రోహిత్ శర్మ ఎదురు దాడి కి దిగాడు 57 బండితులోనే 6 సిక్స్ లు 5 ఫోర్లు కొట్టి 81 పరుగులు చేసి మాక్స్ వెల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.అయితే రోహిత్ సెంచరీ చేస్తాడు అని అందరు ననుకున్నారు కానీ మిస్ అయిపొయింది.ఇక కోహ్లీ కూడా ఈ మ్యాచ్ లో ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి టీం కి తన వంతు సహాయం అందించాడు. అయితే మిడిలాడర్ లో అయ్యర్, రాహుల్ బాగానే ఆడినప్పటికీ మక్సవెల్ చాలా బాగా బౌలింగ్ వేసి 4 వికెట్లు తీసి ఇండియన్ టీం ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దీంతో మరో రెండు బాల్స్ మిగిలి ఉండగానే ఇండియా 286 పరుగు చేసి ఆలౌట్ అయింది.ఇక 4 వికెట్లు తీసిన మక్సవెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ఈ సిరీస్ లో అద్భుతం గా బ్యాటింగ్ చేసి ఒక సెంచరీ కూడా చేసిన శుభ్ మాన్ గిల్ మాత్రం ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.అయితే ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ మా టీం అన్ని విధాలుగా స్ట్రాంగ్ గా ఉంది అయినప్పటికీ ఈ మ్యాచ్ లో మేము కొంతవరకు రాంగ్ స్టెప్స్ వేసాము, అయినా పర్లేదు ఎందుకంటే వరల్డ్ కప్ ముందు మా బలం ఏంటి, బలహీనతలు ఏంటి అనేది తెలియడం కోసమే ఈ మ్యాచ్ ఆడాము.అలాగే మా టీం లో కీలక బౌలర్ అయినా బుమ్రా కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు.ఇక వరల్డ్ కప్ కి ఆడే 15 మంది ప్లేయర్లు ఎవరో మాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది.మొత్తానికి ఇప్పుడు టీం అంత స్ట్రాంగ్ గా ఉంది అలాగే నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాను. ముఖ్యం గా ఆ హిట్టింగ్ చేయడం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక వరల్డ్ కప్ లాంటి టోర్నీ లో గెలవాలంటే అందరం మంచి పెర్ఫామెన్స్ ఇస్తేనే ఇది సాధ్యం అవుతుంది అంటూ రోహిత్ శర్మ మాట్లాడటం జరిగింది…