సన్‌రైజర్స్‌ ఆశలపై నీళ్లు : నటరాజన్‌కు నో ఛాన్స్‌

ఐపీఎల్‌ పోరులో ఎలాంటి అంచనాలు లేకుండానే సెమీ ఫైనల్‌ వరకూ చేరింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. సన్‌రైజర్స్‌ అభిమానులకు మరో బ్యాడ్‌ న్యూస్‌. ఆస్ట్రేలియా పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆరెంజ్ ఆర్మీ యార్కర్ల కింగ్ టీ నటరాజన్ టెస్ట్ అరంగేట్రం మరింత ఆలస్యం కానుంది. స్టార్ పేసర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాల బారిన పడటంతో నట్టూ బరిలోకి దిగడం ఖాయామని అంతా భావించారు. టీమ్‌ మేనేజ్‌మెంట్ మాత్రం శార్దుల్ ఠాకూర్‌కు అవకాశం ఇచ్చింది. ఇక […]

Written By: Srinivas, Updated On : December 30, 2020 3:33 pm
Follow us on


ఐపీఎల్‌ పోరులో ఎలాంటి అంచనాలు లేకుండానే సెమీ ఫైనల్‌ వరకూ చేరింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. సన్‌రైజర్స్‌ అభిమానులకు మరో బ్యాడ్‌ న్యూస్‌. ఆస్ట్రేలియా పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆరెంజ్ ఆర్మీ యార్కర్ల కింగ్ టీ నటరాజన్ టెస్ట్ అరంగేట్రం మరింత ఆలస్యం కానుంది. స్టార్ పేసర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాల బారిన పడటంతో నట్టూ బరిలోకి దిగడం ఖాయామని అంతా భావించారు. టీమ్‌ మేనేజ్‌మెంట్ మాత్రం శార్దుల్ ఠాకూర్‌కు అవకాశం ఇచ్చింది. ఇక ఉమేశ్ యాదవ్ మూడో టెస్ట్‌కు దూరమైనా నాలుగో టెస్ట్ వరుకు అందుబాటులోకి వస్తాడని టీమ్ వర్గాలు తెలిపాయి. మణికట్టు గాయంతో సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న షమీ స్థానంలో శార్దుల్ ఠాకుర్‌ను తీసుకుంది.

Also Read: బుమ్రా అరుదైన రికార్డు.. కుంబ్లే సరసన చేరాడు..!

జనవరి 15న మరో టెస్టు ఆరంభం కానుంది. అప్పటివరకు రెండు వారాల కన్నా ఎక్కువ సమయం ఉండటంతో చివరి టెస్టులో ఉమేష్ యాదవ్ మళ్లీ ఆడుతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ‘సెలెక్టర్లు మహ్మద్ షమీ స్థానంలో ముంబై పేసర్ శార్దుల్ ఠాకుర్‌ను తీసుకున్నారు. ఇప్పటికే బెంచ్‌లో నవ్‌దీప్ సైనీ ఉన్నాడు. ఉమేశ్ యాదవ్ తదుపరి మ్యాచ్ ఆడకపోయినా నాలుగో టెస్ట్‌ వరకు అందుబాటులోకి వస్తాడు. అతను సిరీస్‌కు దూరమైతేనే నటరాజన్‌కు అవకాశం ఉంటుంది’అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.

Also Read: ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ భారత్ దే

సన్‌రైజర్స్‌ టీమ్‌ తరఫున నటరాజన్‌ సత్తాచాటాడు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు తొలుత నెట్‌ బౌలర్‌‌గా ఎంపికయ్యారు. వరుణ్ చక్రవర్తి గాయంతో టీ20ల్లో అవకాశం దక్కించుకోగా.. ఆ తర్వాత నవదీప్ సైనీ వెన్ను గాయంతో ఇబ్బంది పడడంతో వన్డేల్లోకి వచ్చాడు. తొలి రెండు వన్డేల్లో ఓడిన జట్టుకు మూడో వన్డేలో తనదైన బౌలింగ్‌తో రెండు వికెట్లు తీసి ఓదార్పు విజయాన్నందించాడు. ఆ ప్రదర్శనను టీ20ల్లోనూ కొనసాగించాడు. మూడు టీ20ల్లో పొదుపైన బౌలింగ్‌తో 6 వికెట్లు తీసి మరో బుమ్రాను తలపించాడు.

అయితే.. ఇప్పుడు ఉమేష్ యాదవ్ గాయాల పాలవ్వడంతో టెస్టుల్లో కూడా నటరాజన్‌కు చోటు దక్కుతుందనుకున్నారు. కానీ సంప్రదాయక ఫార్మాట్‌లో ఆడేందుకు నటరాజన్ మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది. తొలి రెండు టెస్ట్‌ల్లో విఫలమైన హనుమ విహారీ, మయాంక్ అగర్వాల్‌పై వేటు పడే అవకాశం ఉంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ క్వారంటైన్ ముగించుకొని నేడు జట్టుతో కలవనుండగా.. కేఎల్ రాహుల్ అవకాశం కోసం నిరీక్షిస్తున్నాడు. ఈ ఇద్దరిని జట్టులోకి తీసుకొని బ్యాటింగ్ బలం పెంచుకోవాని టీమిండియా భావిస్తోంది. అదే జరిగితే మయాంక్, విహారి బెంచ్ పరిమితమవ్వడం ఖాయం. ఒకవేళ రోహిత్‌ను ఒక్కడినే తీసుకోవాలంటే మాత్రం మయాంక్‌పై వేటు పడుతుంది. కానీ విన్నింగ్ టీమ్‌ను రహానే మారుస్తాడా? అనేది కూడా సందేహమే.