https://oktelugu.com/

ప్రశ్నిస్తే చంపేస్తారా..: కడప జిల్లాలో రాజకీయ హత్యలు

ప్రొద్దుటూరులో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్ద అందరూ చూస్తుండగానే దుండగులు సుబ్బయ్యను నరికి చంపారు. తీవ్రంగా గాయపడిన సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు జమ్మలమడుగు నియోజకవర్గంలో గండికోట ముంపు ప్రాంతం నష్టపరిహారం విషయంలో అనర్హుల్ని చేర్చి పెద్ద ఎత్తున డబ్బులు నొక్కేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఓ యువకుడు పోరాటం చేశాడు. అతను రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి. దీనికి […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 30, 2020 / 02:06 PM IST
    Follow us on


    ప్రొద్దుటూరులో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్ద అందరూ చూస్తుండగానే దుండగులు సుబ్బయ్యను నరికి చంపారు. తీవ్రంగా గాయపడిన సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు జమ్మలమడుగు నియోజకవర్గంలో గండికోట ముంపు ప్రాంతం నష్టపరిహారం విషయంలో అనర్హుల్ని చేర్చి పెద్ద ఎత్తున డబ్బులు నొక్కేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఓ యువకుడు పోరాటం చేశాడు. అతను రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి. దీనికి సంబంధించి జరిగిన గ్రామసభలోనే ఆ యువకుడిని హత్య చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. కానీ నిందితులు ఎవరో.. వారిని అరెస్ట్ చేశారో లేదో క్లారిటీ లేదు. ఆ తర్వాత ఓ మాజీ జవానును కూడా హత్య చేశారు.

    Also Read: ఆలయాలపై దాడులు.. సీఎం జగన్ ఎందుకు స్పందించరు?

    కడప జిల్లాలో ఇటీవలి కాలంలో వరుసగా హత్యలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ జిల్లాలో జరుగుతున్న హత్యలు అత్యంత దారుణమైనవి. ప్రజల్లో భయాందోళనలు కల్పించి, ఎవరైనా నోరెత్తితే అలాంటి పరిస్థితులే ఏర్పడతాయని.. చెప్పడానికి అన్నట్లుగా ఎక్కడ అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపిస్తాయో అక్కడే దారుణంగా హత్యలు చేస్తున్నారు. కానీ.. బాధితులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గతంలో తెలుగుదేశం పార్టీ కొన్ని ప్రత్యేకమైన ఆరోపణలు చేసేది. వైసీపీ వస్తే నేరగాళ్ల రాజ్యం వస్తుందని.. ఎవరి ప్రాణాలకు గ్యారంటీ ఉండదని ఆ ప్రచారం సారాంశం. అయితే ప్రజలు దాన్ని నమ్మలేదని వైసీపీకి లభించిన విజయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

    Also Read: రామతీర్థం రాములవారి విగ్రహం ధ్వంసం.. కల్లోలం సృష్టించేందుకేనా..?

    కానీ.. ప్రజల్లో ఓ అభిప్రాయాన్ని మాత్రం ప్రతిపక్ష పార్టీలు కల్పించాయి. ప్రభుత్వం ఆ అభిప్రాయం తప్పు అని నిరూపించుకోవాల్సి ఉంది. కానీ ఇప్పుడు జరుగుతోంది వేరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై దాడులు జరుగుతున్నాయి. కడప జిల్లాలో హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యల వెనుక అవినీతిని ప్రశ్నించడం అనే కోణం తెరపైకి వస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. అవినీతి కామన్‌. అది గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఉంటుంది. కానీ.. ఆ అవినీతిని ప్రశ్నిస్తే చంపేయడం ఏంటనేది ఇప్పుడు వెల్లువెత్తుతున్న ప్రశ్న. ప్రతిపక్షం వారికి.. ప్రజలకు ఆ మాత్రం ప్రశ్నించే హక్కు లేదా..? ప్రశ్నిస్తే చంపేస్తారా..? అనే అభిప్రాయం వెల్లడువుతోంది. అవును.. మరి దీనిపై ప్రభుత్వ పెద్దలు కూడా స్పందించి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.