https://oktelugu.com/

Suryakumar Yadav: ఆస్ట్రేలియన్ ప్లేయర్ల కి చెమటలు పట్టించిన సూర్యకుమార్ యాదవ్.. వీడియో వైరల్

అయితే క్రీజ్ లోకి వచ్చిన మొదట్లో తడబడ్డ సూర్య ఆ తరువాత గేర్ మార్చి బాదడం మొదలు పెట్టాడు. అది మాములు బాదడం కాదు వేసిన ప్రతి బౌలర్ ని ఉతికి ఆరేసాడు..

Written By:
  • Gopi
  • , Updated On : September 25, 2023 / 11:47 AM IST
    Follow us on

    Suryakumar Yadav: ఇండోర్ వేదిక గా ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది.నిజానికి ఈ మధ్య ఇండియా ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఈ మూవ్మెంట్ చూస్తుంటే ఈసారి వరల్డ్ కప్ ఇండియా దాటి వెళ్ళదు అనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక మొన్నటి దాక సూర్య కుమార్ యాదవ్ మీదనే ఎక్కువగా చర్చ నడించింది.ఆయన ఎన్ని అవకాశాలు ఇచ్చిన ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడటం లేదు అనే ఒక పెద్ద చర్చ అయితే బిసిసిఐ లో నడిచింది.

    అలాగే క్రికెట్ అభిమానులు కూడా అయన మీద నెగిటివ్ ఫీలింగ్ తో ఉన్నారు ఇక రీసెంట్ గా ఆస్ట్రేలియా మీద జరిగిన రెండు వన్డేల్లో తన సత్తా ఏంటి అనేది చూపిస్తూ తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సూర్య నిజానికి మొదటి వన్డే లో హాఫ్ సెంచరీ చేసాడు, ఈయన రెండో వన్డేలో 72 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఒక దశ లో ఇండియా స్కోర్ 360 అయినా చేస్తుందా అని అనుకున్నారు కానీ చివర్లో సూర్య మెరుపు ఇన్నింగ్స్ తో 399 భారీ పరుగులు అయితే చేసింది.ఇక మన ఇండియా టీం కి ఆస్ట్రేలియా మీద వన్డే ల్లో ఇదే హైయెస్ట్ స్కోర్…

    అయితే క్రీజ్ లోకి వచ్చిన మొదట్లో తడబడ్డ సూర్య ఆ తరువాత గేర్ మార్చి బాదడం మొదలు పెట్టాడు. అది మాములు బాదడం కాదు వేసిన ప్రతి బౌలర్ ని ఉతికి ఆరేసాడు నిజానికి సూర్య లాంటి ఒక ప్లేయర్ ఆడితే ఎలా ఉంటుందో అలా బీభత్సము సృష్టించాడు.ఇక ఈ మ్యాచ్ లో మిస్టర్ 360 గా ఉన్న ఆయన పేరు ని కాపాడుకుంటూ స్టేడియం మొత్తం 360 డిగ్రీ లో షాట్స్ ఆడుతూ ప్రేక్షకులకు ఆనందాన్ని అందించాడు…

    ఇక ముఖ్యం గా కెమరూన్ గ్రీన్ కి అయితే ఆల్మోస్ట్ చెమటలు పట్టించాడు.తను వేసిన 44 ఓవర్ లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు సిక్స్ లు కొట్టాడు, ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు కొడతాడేమో అనేలా కనిపించాడు, కానీ చివరి రెండు బంతులకి రెండు సింగిల్స్ మాత్రమే వచ్చాయి.ఈ దెబ్బతో గ్రీన్ వేసిన 10 ఓవర్లలో 103 పరుగులు ఇచ్చాడు. ఇక సూర్య 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసాడు ఇక మొత్తం 37 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు…దింతో వరల్డ్ కప్ బరిలో సూర్య పేరు కూడా చాలా కీలకం కానుందని తెలుస్తుంది…