IND vs AUS Washington Sundar : క్రికెట్ లో.. ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఎంత వేగంగా పరుగులు చేస్తే జట్టుకు అంత లాభం. ఆటగాడు వేగంగా బ్యాటింగ్ చేసిన దానినిబట్టే జట్టు స్కోర్ ఆధారపడి ఉంటుంది. స్కోర్ మాత్రమే కాదు విజయం కూడా డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇటువంటి వేగాన్ని ప్రదర్శించడంలో వాషింగ్టన్ సుందర్ ముందు వరుసలో ఉంటాడు. వాస్తవానికి టి20 ఫార్మేట్లో అతడికి స్థిరమైన స్థానం లేకపోయినప్పటికీ.. తనకు వచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకుంటాడు.
ఆస్ట్రేలియా జట్టుతో ప్రస్తుతం జరుగుతున్న టి20 సిరీస్లో అతనికి మూడో మ్యాచ్లో అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని అతడు అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. ముఖ్యంగా జట్టు ఒక రకమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మైదానంలోకి వచ్చిన అతడు.. సిక్సర్లు, ఫోర్లతో సంచలనం సృష్టించాడు. అబాట్ నుంచి మొదలుపెడితే ఎల్లిస్ వరకు ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. పైగా ఆరో వికెట్ కు అద్భుతమైన భాగస్వామ్యాన్ని (43*) నమోదు చేసి సంచలనం సృష్టించాడు. టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.
టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మీద గెలిచినప్పటికీ.. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ ఘనతను అందుకోలేకపోయాడు. 23 బంతుల్లోనే అతడు 49 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ చేస్తాడనుకుంటున్న క్రమంలో అప్పటికే టీమిండియా విజయం సాధించడంతో.. నిరాశగా వెళ్లిపోయాడు. వాస్తవానికి అతడు హాఫ్ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అటువంటి అవకాశాలు మైదానాల్లో లభించలేదు. ఇక టి20 లో వాషింగ్టన్ సుందర్ ప్రతి సందర్భంలోనూ ఆపద్బాంధవుడు పాత్ర పోషించాడు. 2023 రాంచీ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు 28 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. టి20 లలో అది అతనికి హైయెస్ట్ స్కోర్. ప్రస్తుత వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా జట్టుపై 23 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఇది అతడికి సెకండ్ హైయెస్ట్ స్కోర్. 2024లో హరారే వేదికగా జింబాబ్వే జట్టుపై 34 బంతుల్లో 27 పరుగులు చేశాడు. 2025లో చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 19 బంతుల్లో 26 పరులు చేశాడు. 2024 లో పల్లెకేలే వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక జట్టుపై 18 బంతుల్లో 25 పరుగులు చేశాడు.
టి20లలో వేగంగా పరుగులు చేయడంలో సుందర్ సిద్ధహస్తుడు. ముఖ్యంగా జట్టు అవసరాలకు తగ్గట్టుగా అతని బ్యాటింగ్ చేస్తాడు. అతడు మిడిల్ లో బ్యాటింగ్ కి వస్తాడు కాబట్టి ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అయినప్పటికీ ఆ ఒత్తిడిని తట్టుకుంటూ బ్యాటింగ్ చేస్తాడు. అందువల్లే అతడిని ఆపద్బాంధవుడు అని పిలుస్తుంటారు. మూడో టి20 మ్యాచ్లో అనేక మార్పులు చేసిన గౌతమ్ గంభీర్.. వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇచ్చి మంచి పని చేశాడు. ఎందుకంటే జట్టు ఒక రకమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్ అదరగొట్టాడు. జితేష్ శర్మ, తిలక్ వర్మతో కలిసి స్ఫూర్తిదాయమైన భాగస్వామ్యాలు నిర్మించాడు. అందువల్లే అంతటి స్కోరును సైతం టీమ్ ఇండియా ఫినిష్ చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్ ను మరోసారి హీరోని చేయగలిగింది.