Wankhede stadium viral love story: ఐపీఎల్ జరుగుతున్నప్పుడు మైదానంలో విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. మీడియా.. సోషల్ మీడియాలో ఇటువంటి విషయాలకు విపరీతమైన ప్రచారం లభిస్తుంది. తద్వారా వారి గురించి ఒక రేంజ్ లో చర్చ నడుస్తూ ఉంటుంది. ప్రతిసారి ఈ తరహా సంఘటనలు ఐపీఎల్ ప్రారంభమైన కొద్ది రోజులకు జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి ఐపీఎల్ ప్రారంభమైన రెండవ రోజే సంచలమైన సంఘటన చోటు చేసుకోవడం విశేషం.
ఐపీఎల్ లో భాగంగా ఆదివారం ముంబై.. కోల్ కతా జట్లు పోటీపడ్డాయి. ఈ క్రమంలో ముంబై మైదానంలో చోటు చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది.. వాస్తవానికి ఈ మైదానంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఆటగాడు రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన స్టైల్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. పరుగుల వరద పారించాడు. కోల్ కతా విధించిన లక్ష్యాన్ని అతడు పూచిక పుల్లతో సమానంగా చేశాడు. దీంతో మైదానానికి వచ్చిన అభిమానులు మొత్తం రోహిత్ నామస్మరణతో ఊగిపోయారు.. రోహిత్ కూడా వచ్చిన అభిమానుల ఉత్సాహానికి తగ్గట్టుగానే బ్యాటింగ్ చేశాడు.
రోహిత్ ముంబై మైదానంలో ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. అయితే అతడికి మించి వీరిద్దరు అయ్యారు. వారిద్దరూ చేసిన పని రోహిత్ శర్మ చేసిన హాఫ్ సెంచరీని కూడా మించిపోయింది. అంతేకాదు ఈ ఒక్క సంఘటనతో వారిద్దరు సెలబ్రిటీలు కూడా అయిపోయారు..
Also Read: కోల్ కతా లో చిచ్చు పెట్టిన రహానే.. షారుక్ ఖాన్ ఇది ఊహించలేదుగా
ముంబై మైదానంలో స్టాండ్స్ లో ఓ యువకుడు వినూత్నంగా తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. ఆమె చేతి వేలికి ఉంగరం తొడగాలి అనుకున్నాడు. అ ఉంగరం చేతి నుంచి జారిపోయింది. దీంతో ఆ ఉంగరం కోసం వెతుకులాట మొదలైంది. వారిద్దరు ఆ ఉంగరం కోసం తీవ్రంగా వెతుకుతూ ఉండగా.. వచ్చిన ప్రేక్షకులు సహాయం చేశారు.
చివరికి ఆ ఉంగరం దొరికింది. దీంతో ఆ యువకుడు తన మోకాళ్ళ మీద కూర్చొని ఆమెకు ఉంగరం తొడిగాడు. దానికి ఆమె ఎస్ చెప్పడంతో.. స్టేడియం మొత్తం సందడిగా మారింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విపరీతమైన వీక్షణలను సొంతం చేసుకుంటున్నది. వీరిద్దరు చేసిన పని రోహిత్ శర్మ బ్యాటింగ్ ను సైతం మర్చిపోయేలా చేసిందని.. వారిద్దరూ సెలబ్రెటీలు అయిపోయారని.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు చర్చించుకోవడం గమనార్హం.
గతంలో చెన్నై, ముంబై జట్లు తలపడుతున్నప్పుడు .. ధోని అవుట్ అయ్యాడు. ధోని నిరాశగా మైదానాన్ని వీడి వస్తుండగా.. ఓ మహిళ అభిమాని ఆవేదన వ్యక్తం చేసింది. తన ముఖంలో చిత్రమైన హావ భావాలను ప్రదర్శించింది. దీంతో ఆమె కదలికలను కెమెరామెన్లు పదే పదే షూట్ చేసి.. లైవ్ టెలికాస్ట్ చేశారు. దీంతో ఆ అమ్మాయి కాస్త సెలెబ్రెటీ అయిపోయింది. ఇప్పుడు వీరిద్దరు కూడా సెలబ్రిటీలు అయిపోయారు.