Virat Kohli–Anushka : అనుష–విరాట్ దంపతులు పవర్‌ఫు కపుల్‌గా గుర్తింపు ఉంది. ఈ ఇద్దరిదీ ప్రేమ వివాహం. వీరిక ఇద్దరు పిల్లలు. పాప మూడేళ్లుకుపైగానే ఉంటుంది. బాబు వయసు ఏడాదిలోపే. పిల్లల ఫొటోలు ఎక్కడా రివీల్ కాకుండా ఇంతకాలం జాగ్రత్త పడ్డారు. అయితే ఎట్టకేలకు వారి ఫొటోలు రివీల్ చేశారు. కోహ్లి బర్త్‌డే సందర్భంగా అనుష్కశర్మ, మొదటిసారి విరాత్ తమ పిల్లలతో ఉన్న ఫొటోను షేర్‌చేశారు. పిల్లల పేర్లు తెలిసినా ఎవరికీ వారి ఫొటోలు చూపించలేదు. పిల్లలు ఎలా ఉన్నారో చూడాలని చాలా మంది ఆత్రుతగా ఉన్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా నుంచి రాగానే అనుష్క–విరాట్ దపంతులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరికి దైవ భక్తి ఎక్కువ. అందుకే వీలు చిక్కితే గుళ్లు గోపురాలకు వెల్లారు. ఆధ్యాత్మిక గురువులను కలుస్తారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని వచ్చిన కోహ్లీ దంపతులు పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక ప్రాంతమైన బృందావన్ ధామ్‌ను సందర్శించారు.
సోషల్ మీడియాలో వైరల్..
పిల్లలు అకాయ్, వామికతో కలిసి విరుష్క దంపతులు శ్రీ ప్రేమానంద్ గోవింద్‌శరణ్ జీ మహారాజ్‌ని కలిశారు. వారితో శ్రీప్రేమాణంద్ గోవింద్ శరణ్‌జీ మహారాజ్ ఆప్యాయంగా మాట్లాడారు. సుఖసంతోషాలతో, ప్రేమతో ఉండాలని ఆశీర్వదించారు. విరుష్క దంపతులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరుష్క దంపతులు గతంలో అనేకసార్లు శ్రీప్రేమానంద్ గోవింద్‌శరణ్‌జీ మహారాజ్‌ను కలిశారు.
మీడియాకు దూరంగా…
తన ఆటతో కోహ్లీ దేశానికి సంతోషం పంచుతున్నారు. అతను గెలిస్తే దేశం అంతా సంతోషంగా ఉంటుంది.అతడిని ప్రజలు అంతలా ప్రేమిస్తున్నారు. అందుకే కోహ్లీ తన పిల్లలను మీడియాకు దూరంగా, స్వేచ్ఛగా పెంచాలనుకుంటున్నారు. అందుకే పిల్లల గోప్యత విషయంలో జాగ్రత్తగా ఉంటారు విరుష్క దంపతులు. సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేసినప్పుడు ముఖాలు కనిపించకుండా ఈమోజీలు ఉంచుతారు. అయితే తాజాగా ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహరాజ్‌ని సందర్శించి వెళ్తున్నప్పుడు విరాట్ కోహ్లీ–అనుస్క దంపతుల పిల్లలు ముఖాలు రివీల్ అయ్యాయి.
పేలవ ఫామ్‌తో సతమతం..
ఇదిలా ఉంటే కోహ్లీ కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ విఫలమయ్యాడు. 9 ఇన్నింగ్స్‌లో 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఈ సిరీస్‌లో ఆఫ్ స్టంబ్ బలహీనత బయటపడింది. ఈ బలహీనతను అధిగమించలేకపోతున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
Virat Kohli और Anushka Sharma की पूज्य महाराज जी से क्या वार्ता हुई ? Bhajan Marg pic.twitter.com/WyKxChE8mC
— Bhajan Marg (@RadhaKeliKunj) January 10, 2025