Victory Venkatesh : మూడు దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో టాప్ హీరో గా కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. పబ్లిసిటీ కోసం ఏది పది అది చెయ్యడు, వివాదాలకు కంటికి కనిపించనంత దూరంగా ఉంటాడు. అతని పై నెగటివ్ గా ఇన్నేళ్ళ కెరీర్ లో ఒక్క మచ్చ కూడా లేదు. అలాంటి హీరో మీద కూడా ఇప్పుడు ఒక వివాదం అంటుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఫిలిం నగర్ లో దక్కన్ కిచెన్ అనే హోటల్ ఉండేది. ఆ ప్రాంతంలో ఈ హోటల్ చాలా పాపులర్. దీనిని దగ్గుపాటి ఫ్యామిలీ బలవంతంగా కొంత భాగం వరకు కూల్చేసింది. ఈ హోటల్ ఉన్నటువంటి ల్యాండ్ తమది అని వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు వినిపించిన వాదన. కాదు మాదే అంటూ ఆ హోటల్ యజమాని నందకిషోర్ వాదించాడు. తనకి న్యాయం జరిపించాలని కోర్టు ని ఆశ్రయించాడు.
అక్కడ కేసు పెండింగ్ లో ఉండడం తో హై కోర్టుని ఆశ్రయించగా, హై కోర్టు తదుపరి విచారణ వరకు హోటల్ పై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. కానీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా శనివారం రోజు ఈ హోటల్ ని పూర్తి స్థాయిలో కూల్చేశారు. దీంతో ఆగ్రహించిన కోర్టు దగ్గుబాటి కుటుంబం పై FIR నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు పోలీసులు విక్టరీ వెంకటేష్, సురేష్ బాబు, రానా , అభి రామ్ లపై 448 452, 458,120 బి సెక్షన్స్ క్రింద కేసు ఫైల్ చేసి FIR నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. ఇటీవల వరుసగా సినీ సెలెబ్రిటీలపై కేసులు, FIR లు, జైలుకు వెళ్తున్న ఈ నేపథ్యం లో వెంకటేష్ ని కూడా అరెస్ట్ చేయబోతున్నారా అని అభిమానులు భయపడుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే మరో రెండు రోజుల్లో వెంకటేష్ హీరో గా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా పై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. సినిమా కచ్చితంగా సక్సెస్ అయ్యేలాగానే అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఈ కేసు తలనొప్పి రావడం కొంచెం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. కోర్టు ఆర్డర్స్ ని పట్టించుకోకుంటే చాలా కఠినమైన చర్యలే ఉంటాయి. మరి దగ్గుబాటి కుటుంబం వద్ద దీనికి ఎలాంటి సమాధానం ఉంటుందో చూడాలి. ఒకవేళ వెంకటేష్ అరెస్ట్ అయితే మాత్రం ప్రభుత్వం పై తీవ్రమైన నెగటివిటీ ఏర్పడే అవకాశం ఉంది. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమి లేకపోయినప్పటికీ, అల్లు అర్జున్ విషయం లో ప్రభుత్వం సినీ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తుంది అనే అభిప్రాయం జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఇది కూడా ప్రభుత్వమే చేయిస్తుందని ప్రజలు ఫిక్స్ అయిపోతారు.