Odi World Cup 2023: వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు వెళ్ళే జట్లు ఇవే.. తేల్చి చెప్పిన దిగ్గజ క్రికెటర్లు..!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో ఫేవరెట్ జట్లు అవే అంటూ పలువురు మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫేవరెట్ గా బరిలోకి దిగుతాయని పలువురు విశ్లేషిస్తుంటే.. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగే జట్లు ఈసారి చెత్త చాటే అవకాశం ఉందని మరి కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణలు నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ కు మరింత క్రేజ్ పెరుగుతోంది.

Written By: BS, Updated On : June 28, 2023 10:57 am

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: వన్డే వరల్డ్ కప్ కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి వరల్డ్ కప్ కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది. అక్టోబర్ నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వరల్డ్ కప్ ఆడేందుకు ఎనిమిది జట్లు క్వాలిఫై కాగా.. మరో రెండు జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్ ల్లో అర్హత సాధించి వరల్డ్ కప్ బరిలోకి దిగనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వరల్డ్ కప్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఇంకా మూడు నెలల సమయం ఉండగా వరల్డ్ కప్ కేంద్రంగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్లు తమ ఫేవరెట్ జట్ల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు.

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో ఫేవరెట్ జట్లు అవే అంటూ పలువురు మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫేవరెట్ గా బరిలోకి దిగుతాయని పలువురు విశ్లేషిస్తుంటే.. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగే జట్లు ఈసారి చెత్త చాటే అవకాశం ఉందని మరి కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణలు నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ కు మరింత క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్, శ్రీలంక జట్లకు చెందిన దిగ్గజ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ముత్తయ్య మురళీధరన్ వరల్డ్ కప్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ జట్లు సెమీఫైనల్ కు వెళతాయి అంటూ జోస్యం చెప్పారు.

ఆ నాలుగు జట్లే సెమీ ఫైనల్స్ కు వెళతాయి..

వన్డే వరల్డ్ కప్ ను ఈసారి ఎన్ని జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ.. సెమీఫైనల్స్ కు మాత్రం ఆ నాలుగు జట్లే వెళతాయని భారత జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, శ్రీలంక జట్టు మాజీ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జోస్యం చెప్పారు. మరో వంద రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ సంబంధించి ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ముందుగానే సెమీఫైనల్ మ్యాచ్లను ప్రిడిక్ట్ చేశారు. సెమీ ఫైనల్స్ కు వెళ్లే జట్టులో ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఉంటాయని వీరిద్దరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ నాలుగు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉండడంతోపాటు.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జట్టును ముందుకు తీసుకెళ్లగల సమర్థత కలిగిన ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్లే సెమీఫైనల్స్ వరకు వెళ్తాయని భావిస్తున్నట్లు వీరు వెల్లడించారు. వీరిద్దరూ చెప్పిన జట్లకు సంబంధించి అభిమానులు వివిధ రకాలుగా సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగే జట్లు కూడా ఈ వరల్డ్ కప్ లో సత్తా చాటే అవకాశం ఉందని, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక వంటి జట్లు పెద్ద జట్లకు షాక్ కు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం సెహ్వాగ్, మురళీధరన్ ప్రిడిక్షన్ పట్ల జోరుగా సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.