https://oktelugu.com/

Naga Shaurya: ఈ రోజుల్లో అమ్మాయిలే తప్పు చేస్తున్నారు… హీరో నాగ శౌర్య సంచలన కామెంట్స్

అప్పుడు ఆ అమ్మాయి రివర్స్ అయ్యింది. అతను నా లవర్, నన్ను కొడతాడు, తిడతాడు. మీకు అనవసరం అంది. ఆ సంఘటనలో అమ్మాయిదే తప్పు అనిపించింది.

Written By:
  • Shiva
  • , Updated On : June 28, 2023 / 10:45 AM IST

    Naga Shaurya

    Follow us on

    Naga Shaurya: యంగ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ మూవీ రంగబలి. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న నాగ శౌర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల నాగ శౌర్య పబ్లిక్ లో ఓ యువకుడి మీద గొడవకు దిగాడు. ఆ రోజు ఏం జరిగింది? పబ్లిక్ లో మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు? అని మీడియా ప్రతినిధులు అడిగారు. వివరణ ఇస్తూ… ఆ రోజు నేను కారులో వెళుతుంటే కూకట్ పల్లి సమీపంలో ఒక అబ్బాయి అమ్మాయిని కొడుతున్నాడు. నేను అతని వద్దకు వెళ్లి ఎందుకు ఆ అమ్మాయిని కొడుతున్నావ్. ఆమెకు సారీ చెప్పు అన్నాను.

    అప్పుడు ఆ అమ్మాయి రివర్స్ అయ్యింది. అతను నా లవర్, నన్ను కొడతాడు, తిడతాడు. మీకు అనవసరం అంది. ఆ సంఘటనలో అమ్మాయిదే తప్పు అనిపించింది. తనను కొడుతున్న అబ్బాయికి సపోర్ట్ చేసింది. నేను అమ్మాయిలకు ఒకటే చెబుతున్నా మిమ్మల్ని కొట్టే అబ్బాయిలను పెళ్లి చేసుకోవద్దు. అది మీకు, మీ కుటుంబానికి మంచిది కాదు. చెప్పాలంటే ఈ రోజుల్లో అమ్మాయిలే తప్పు చేస్తున్నారు. సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారని నాగ శౌర్య అభిప్రాయపడ్డారు. ఇంతకీ మీరు ఎలాంటి అబ్బాయి అని అడగ్గా… మంచి వాడిని అని నవ్వేశాడు.

    ఈ వివాదం జరిగిన సమయంలో నాగ శౌర్య నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో నాగ శౌర్య ప్రచారం కోసం ఫ్రాంక్ చేశారని పలువురు భావించారు. అది ఫ్రాంక్ కాదు. ఆ అమ్మాయి అబ్బాయి ఎవరో నాకు తెలియదంటూ నాగ శౌర్య చెప్పుకొచ్చారు. ఇక ఆయన నటించిన రంగబలి మూవీ జులై 7న విడుదల కానుంది. పవన్ దర్శకత్వం వహించారు.

    విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇక వరుస పరాజయాలతో నాగ శౌర్య ఇబ్బంది పడుతున్నారు. ఆయన హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. రంగబలి ఆయనకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ధమాకా మూవీతో హిట్ కొట్టిన త్రినాథరావు నక్కినతో ఒక చిత్రానికి సైన్ చేశాడు. ఈ మూవీ సొంత బ్యానర్ లో తెరకెక్కనుంది. ఛలో నాగ శౌర్య కెరీర్లో సూపర్ హిట్ గా ఉంది. ఆ చిత్ర దర్శకుడు వెంకీ కుడుములతో నాగ శౌర్యకు విభేదాలు తలెత్తాయి.