Virat Kohli and Rohit Sharma latest news: 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమ్ ఇండియాలో విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ ఆడతారని అందరూ అనుకుంటున్నారు. పైగా వారిద్దరు కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. మిగతా బ్యాటర్ల కంటే ఎక్కువగా పరుగులు చేస్తున్నారు. తాజా ఐపిఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ తన జోరు చూపించాడు. అయితే రోహిత్ శర్మ మాత్రం అనుకున్న దానికంటే గొప్పగా ఆడలేకపోయినప్పటికీ.. తన స్థాయిలో మాత్రం మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అప్పుడప్పుడు గాయాల బారిన పడటంతో అతడు జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
త్వరలో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో 3 వన్డేల సిరీస్ ఆడుతుంది. 2027 వన్డే విశ్వసమరం జరగనుంది. ఈ సిరీస్ టీమిండియా కు అత్యంత ముఖ్యంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కోసం ప్లేయర్లను మేనేజ్మెంట్ ప్రకటించింది. ఇందులో కోహ్లీకి అవకాశం లభించలేదు. రోహిత్ శర్మ కూడా ఆడేది అనుమానంగానే ఉంది.. ఈనెల 13 నుంచి ఈ సిరీస్ మొదలవుతుంది. టీమిడియాకు గిల్ నాయకత్వం వహిస్తాడు. విరాట్ లేకుండా.. రోహిత్ కనిపించకుండా ఈ సిరీస్ నడుస్తుందని ఇప్పటికే జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
విరాట్ కోహ్లీ హ్యామ్ స్ట్రింగ్ గాయం వల్ల ఈ సిరీస్ కు ఎంపిక చేయలేదని వార్తలు వస్తున్నాయి. ఇటీవల అతడు ఒక మ్యాచ్లో గాయపడ్డాడు. అందువల్లే మైదానంలోకి రాలేదు. ఫైనల్ మ్యాచ్లో మాత్రం స్థిరంగా బ్యాటింగ్ చేశాడు. చురుకుగా ఫీల్డింగ్ చేశాడు. ఆఫ్గనిస్తాన్ జట్టుతో సిరీస్ కోసం అతడిని ఎంపిక చేయకపోవడం పట్ల రకరకాల వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ అభ్యర్థన మేరకు మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని కొంతమంది.. అతడిని 2027 వరల్డ్ కప్ కోసం ఆడించాలి కాబట్టి ఇప్పుడు రెస్ట్ ఇస్తున్నారని మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విరాట్ కోహ్లీ ఇలాంటి ఆటగాడు జట్టులో లేకుండా.. మ్యాచ్ చూడడం అంత ఈజీ కాదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
విరాట్ కోహ్లీ టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. కొద్ది రోజులకే టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా దూరం జరిగాడు. అతడు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఆ మధ్య ఆస్ట్రేలియా సిరీస్ లో విరాట్ దుమ్మురేపాడు. రోహిత్ కూడా సత్తా చూపించాడు. ఇప్పుడు వీరిద్దరూ లేకుండా ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ టీమ్ ఇండియా ఆడుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
