
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా తడబడింది. వరుసగా ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్ లో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. ముందు స్లోగా ఆడిన కోహ్లీ తర్వాత జోరు పెంచాడు. టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.
మొతేరాలో విరాట్ కోహ్లీ కఠినమైన పిచ్ పై కళాత్మకంగా ఆడాడు. ఇంగ్లండ్ పేసర్ల వేగాన్ని అనుగుణంగా ఆడేశాడు. మణికట్టును ఉపయోగిస్తూ చూడచక్కటి బౌండరీలు బాదేశాడు.. వరుసగా రెండో అర్థశతకం చేశాడు. దాంతో 20 ఓవర్లకు భారత్ 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 25, హార్ధిక్ 17 పరుగులతో రాణించారు.
టాస్ ఓడడం భారత్ కు మైనస్ గా మారింది. ఆరంభంలోనే రాహుల్ సున్నాకే వైదొలిగి మరోసారి పేలవ ఫామ్ ను కొనసాగించాడు. మార్క్ వుడ్ 3 వికెట్లతో చెలరేగాడు. రెండో టీ20 హీరో ఇషాన్ కిషన్, రోహిత్ 15 సైతం స్వల్ప స్కోర్లకే పెవెలియన్ చేరాడు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ 9 ఓవర్లలోనే 78 పరుగులు చేసి విజయం దిశగా కదులుతోంది. ఓపెనర్ బట్లర్ 50 పరుగులు చేసి ఆఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈజీగానే లక్ష్యం దిశగా ఇంగ్లండ్ సాగుతోంది.