https://oktelugu.com/

Virat Kohli : విరాట్ కోహ్లీ ఒక్క పోస్ట్ పెట్టాడు.. రికార్డులు బద్దలయ్యాయి.. దెబ్బకు ఇన్ స్టా గ్రామ్ షేక్ అయింది..

Virat Kohli విరాట్ కోహ్లీని ఇన్ స్టా లో 230 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. అతడు ఇన్ స్టా లో ఏదైనా బ్రాండ్ కు సంబంధించి పోస్ట్ పెడితే కోట్లల్లో వసూలు చేస్తున్నాడు.. తనకు సంబంధించిన అప్డేట్స్, కుటుంబ విషయాలను విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు ఇన్ స్టా లో పోస్ట్ చేస్తుంటాడు.. ఇక టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ఈ ఫోటోను విరాట్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయగా.. అధికంగా 1.2 కోట్ల లైక్స్ పొందింది. అంతకుముందు తన భార్య అనుష్క శర్మతో కలిసి దిగిన ఒక ఫోటోను విరాట్ పోస్ట్ చేయగా.. అది కూడా 1.4 కోట్ల లైక్స్ సొంతం చేసుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : July 7, 2024 / 09:21 PM IST

    Virat Kohli's World Cup trophy received the most likes on Instagram

    Follow us on

    Virat Kohli : విరాట్ కోహ్లీ .. మెజారిటీ భారతీయులకు పరిచయం అవసరం లేని పేరు. సమకాలీన క్రికెట్లో పరుగుల యంత్రంగా పేరు పొందాడు. మైదానంలోకి అడుగు పెడితే చాలు ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుడుతుంది.. తనదైన రోజు మాత్రమే కాదు.. తనది కాని రోజు కూడా విరాట్ దుమ్ము రేపగలడు. బ్యాట్ తో శివతాండవం చేయగలడు.. అది టి20 వరల్డ్ కప్ లో మరోసారి నిరూపితమైంది. ఇటీవలి టి20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ మ్యాచ్ మినహా మిగతా అన్ని జట్లపై విరాట్ విఫలమయ్యాడు. కానీ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై 76 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. వాస్తవానికి 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి.. తీవ్ర కష్టాల్లో పడిన టీమ్ ఇండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

    కేవలం మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ విరాట్ కోహ్లీ కింగ్. ఎందుకంటే అతడిని అనుసరించే వారి సంఖ్య మిలియన్లలో ఉంటుంది. మనదేశంలో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న ఆటగాడిగా విరాట్ కోహ్లీకి పేరుంది. ఇక ఇటీవల టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఇన్ స్టా గ్రామ్ లో విరాట్ కోహ్లీ ఒక ఫోటో పోస్ట్ చేశాడు. “ఇంతకంటే గొప్ప రోజును నేను కలలో కూడా కలగనలేదు. చివరికి మేము అనుకున్నది సాధించాం” అంటూ ఇన్ స్టా లో విరాట్ చేసిన పోస్టు ఏకంగా రెండు కోట్లకు పైగా లైక్స్ సాధించింది. వాస్తవానికి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ, మొదటి ఆసియా క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక లైక్స్ పొందిన క్రీడాకారుల పోస్టులలో.. విరాట్ కోహ్లీ చేసిన పోస్ట్ ఐదవ స్థానంలో నిలిచిందంటే మామూలు విషయం కాదు.

    విరాట్ కోహ్లీని ఇన్ స్టా లో 230 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. అతడు ఇన్ స్టా లో ఏదైనా బ్రాండ్ కు సంబంధించి పోస్ట్ పెడితే కోట్లల్లో వసూలు చేస్తున్నాడు.. తనకు సంబంధించిన అప్డేట్స్, కుటుంబ విషయాలను విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు ఇన్ స్టా లో పోస్ట్ చేస్తుంటాడు.. ఇక టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ఈ ఫోటోను విరాట్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయగా.. అధికంగా 1.2 కోట్ల లైక్స్ పొందింది. అంతకుముందు తన భార్య అనుష్క శర్మతో కలిసి దిగిన ఒక ఫోటోను విరాట్ పోస్ట్ చేయగా.. అది కూడా 1.4 కోట్ల లైక్స్ సొంతం చేసుకుంది.