AP Elections 2024 : తెలుగుదేశం పెన్ డ్రైవ్’ బాంబ్.. వైసీపీపై పడబోతోందా?

వచ్చేది తమ ప్రభుత్వమేనని.. అందరి సంగతి తేల్చుతామని హెచ్చరిక పంపారు. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ పెన్ డ్రైవ్ ప్లాన్ తో వైసీపీకి గట్టి హెచ్చరికలే పంపించగలిగింది.

Written By: NARESH, Updated On : May 19, 2024 1:14 pm

AP Elections 2024, AP Riots, Violence in AP

Follow us on

AP Elections 2024 : ఏపీలో ఎన్నికలు హింసాత్మక ఘటనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మాచర్ల, నరసరావుపేట, పల్నాడు, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో పోలింగ్ నాడు, పోలింగ్ తరువాత హింస చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది. ఆ జిల్లాల అధికారులపై బదిలీ వేటు వేసింది. కొత్త అధికారులను నియమించింది. 13 మంది ప్రత్యేక అధికారులకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమిక విచారణ పూర్తి చేసిన సిట్ బృందం నివేదికను ఎలక్షన్ కమిషన్కు పంపించింది.

అయితే ఈ విషయంలో వైసీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయి. ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గృహనిర్బంధానికి గురయ్యారు. చంద్రబాబు ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసిన తర్వాతే యాక్షన్ ప్రారంభమైంది. అయితే ఈ అల్లర్ల వెనుక వైసీపీ ఉందని చూపించడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయ్యింది.వాస్తవానికి పోలింగ్కు ముందే టిడిపి ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్ళింది.కేంద్ర పెద్దల సాయంతో వైసీపీ దూకుడుకు చెక్ చెప్పింది.దీంతో టిడిపి కూటమి నేతల హవా ముందు.. వైసిపి తేలిపోయింది.

అయితే పోలింగ్ నాడు, పోలింగ్ తరువాత హింసాత్మక ఘటనలకు వైసీపీయే కారణమని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. మూడు రోజులపాటు జరిగిన ఘటనలకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఒక పెన్ డ్రైవ్ రూపొందించింది. అందులో కీలక విషయాలను పొందుపరిచింది. విచారణ అధికారిగా ఉన్న వినీత్ బృందానికి అందజేసింది. నేరుగా డిజిపి కార్యాలయానికి వెళ్లిన వర్ల రామయ్య ఆ పెన్ డ్రైవ్ ను సిట్ ప్రధాన అధికారికి అందజేశారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వైసీపీ శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో డిజిపి కార్యాలయానికి వచ్చి వినతి పత్రాలు అందించే పరిస్థితి లేదని .. ఇకనుంచి ఆ పరిస్థితి ఉండదని వర్ల రామయ్య తేల్చి చెప్పారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. అందరి సంగతి తేల్చుతామని హెచ్చరిక పంపారు. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ పెన్ డ్రైవ్ ప్లాన్ తో వైసీపీకి గట్టి హెచ్చరికలే పంపించగలిగింది.