Virat Kohli : ఆటలో పోటుగాడు.. రికార్డుల వేటగాడు అని మన విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించుకున్నారు. భారత బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లి 2023 ప్రపంచ కప్‌లో రికార్డు బద్దలు కొట్టాడు. అత్యధిక సెంచరీల రికార్డ్ సాధించాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును నాలుగో సారి అందుకున్నాడు. కోహ్లీ గతంలో 2012, 2017 , 2018లో ఈ అవార్డును గెలుచుకున్నాడు. తాజాగా నాలుగోసారి కూడా నిలిచాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును దక్కించుకొని కోహ్లీ ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క క్రికెటర్ గా నిలిచారు.
Player of the tournament at the ICC Men’s @cricketworldcup 2023
The extraordinary India batter has been awarded the ICC Men’s ODI Cricketer of the Year https://t.co/Ea4KJZMImE
— ICC (@ICC) January 25, 2024
ఇప్పటివరకూ ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ తో కోహ్లీ పంచుకున్నాడు. డివిలియర్స్ మూడు అవార్డులతో సరిసమానంగా నిలిచారు. ఈ అవార్డును నాలుగుసార్లు గెలుచుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లి 2022లో తన పునరాగమనాన్ని అద్భుతంగా చాటాడు. 2023లో మరోసారి ఈ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం వన్డేలలో పీక్ ఫామ్‌ను పొందాడు. ఈ వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్రదర్శనతో సత్తా చాటాడు.
టీమిండియా నంబర్ 3 బ్యాట్స్ మెన్ అయిన విరాట్ కోహ్లీ ప్రపంచ కప్‌లో తన 11 ఇన్నింగ్స్‌లలో తొమ్మిదింటిలో కనీసం హాఫ్ సెంచరీని సాధించాడు. 765 పరుగులతో ముగించాడు. ఇది పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఒక వ్యక్తిగత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోర్. ఇది మునుపటి కంటే ఎక్కువ. 2003లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును కోహ్లీ అధిగమించాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో ఒక సెంచరీతో సహా మూడు సెంచరీలతో కోహ్లీ టోర్నమెంట్‌ను 95.62 సగటు మరియు 90.31 స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. ప్రపంచ కప్‌లో అతని అద్భుతమైన పరుగులు, భారత్‌ను ఫైనల్స్‌కు చేరుకోవడానికి సహాయపడింది.
2023లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కొనసాగించాడు. కోహ్లి 36 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో 2,048 పరుగులు చేశాడు. అతను ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. ఫైనల్‌లో టీమిండియా ఓడిపోయినప్పటికీ.. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ టైటిల్‌ను పొందాడు.
35 ఏళ్ల స్టార్ క్రికెటర్ కోహ్లీ 2023లో ఫార్మాట్‌లలో ఎనిమిది సెంచరీలు సాధించి, ఒక సెంచరీతో ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన శుభ్‌మాన్ గిల్‌ను అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 2,000 పరుగుల మార్క్‌ను అధిగమించిన ఏకైక క్రికెటర్‌గా కోహ్లీ , గిల్ నిలిచారు, గిల్ 1584 పరుగులతో వన్డేలలో ఆధిపత్యం చెలాయించాడు.
ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఈ ఏడాది ప్రపంచ కప్ సమయంలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ చారిత్రక రికార్డును అధిగమించాడు. 50 ఓవర్ల క్రికెట్‌లో 50 సెంచరీలు సాధించిన మొదటి క్రికెటర్‌గా కోహ్లీ మైలురాయిని సాధించాడు.