Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli: విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు..

Virat Kohli: విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు..

Virat Kohli : హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ఫీల్డింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయం అని చాటి చెబుతూ.. ముంబై బౌలర్ బౌల్ట్ తన వేసిన తొలి ఓవర్ రెండవ బంతికే ప్రమాదకరమైన సాల్ట్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఈ ఆనందం ముంబై జట్టుకు ఎంతోసేపు లేదు. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కి, వన్ డౌన్ ఆటగాడు, దేవదత్ పడిక్కల్(Devadath padikkal) జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు ఇప్పటివరకు 91పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. విరాట్ కోహ్లీ (52*), పడిక్కల్(37*) క్రీజ్ లో ఉన్నారు. విరాట్ కోహ్లీ విరోచితంగా బ్యాటింగ్ చేస్తుండగా.. పడిక్కల్ కూడా అదే స్థాయిలో ఆడుతున్నాడు. వీరిద్దరిని అవుట్ చేయడానికి ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలర్లను మార్చి మార్చి ప్రయోగిస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. మెన్స్ టి20 క్రికెట్లో అనితర సాధ్యమైన ఘనతను సాధించాడు. భారత దేశం తరఫున ఈ రికార్డు సృష్టించిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.

Also Read : జస్ ప్రీత్ బుమ్రా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. వాంఖడే ఊగిపోయిందిగా..

పరుగుల వరద

మెన్స్ టి20 క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం క్రీస్ గేల్ కొనసాగుతున్నాడు. ఇతడు 381 ఇన్నింగ్స్ లలో 14, 562 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ 474 ఇన్నింగ్స్ లలో 13,610 పరుగులు చేశాడు. పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ 487 ఇన్నింగ్స్ లలో 13,557 పరుగులు పూర్తి చేశాడు. వెస్టిండీస్ ఆటగాడు కైరన్ పొలార్డ్ 594 ఇన్నింగ్స్ లలో 13,537 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ 386 ఇన్నింగ్స్ లలో 13,000 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ టి20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ లో మాత్రం ఆడుతున్నాడు. అంటే ఈ లెక్కన విరాట్ కోహ్లీ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టడం ఖాయం. మరొ 1500 పరుగులు చేస్తే గేల్ ను విరాట్ కోహ్లీ అధిగమిస్తాడు. ఇప్పుడున్న ఫామ్ ప్రకారం చూసుకుంటే విరాట్ కోహ్లీకి అది పెద్ద కష్టం కాదు. ఇక ముంబైలో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ 29 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముంబై మైదానాన్ని తన బ్యాటింగ్ స్టైల్ తో హోరెత్తించాడు. ఫోర్లు, సిక్సర్ లు కొడుతూ శివతాండవం చేశాడు. తనను గోట్ అని ఎందుకు పిలుస్తారో.. తనకు తిక్కరిగితే ఎలా ఉంటుందో విరాట్ కోహ్లీ ముంబై బౌలర్లకు రుచి చూపించాడు.

Aslo Read : గౌతమ్ గంభీర్ తర్వాత టీమ్ ఇండియా కోచ్ ఎవరు? జహీర్ ఖాన్ ఏమంటున్నాడంటే?

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular