Virat Kohli : లక్నోలో జరిగిన నిన్నటి మ్యాచ్లో విరాట్ ఏకంగా హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా ఐపీఎల్లో బెంగళూరు తరఫున 9వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆవేశ వేసిన ఐదవ ఓవర్ లో ఐదో బంతిని ఫోర్ కొట్టి.. కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు.. ఈ పరుగుల్లో ఐపిఎల్ తో పాటు ఛాంపియన్స్ లీగ్ లో బెంగళూరు తరఫున విరాట్ చేసిన రన్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ లిస్టులో విరాట్ 9029 రన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ 6060 పరుగులతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. హంప్ షైర్ తరఫున జేమ్స్ విన్స్ 5934 పరుగులు చేశాడు. చెన్నై తరఫున సురేష్ రైనా 5529, మహేంద్ర సింగ్ ధోని 5314 పరుగులు చేశారు.
Also Read : RCB విన్నింగ్ రన్.. ఏన్నో ఏళ్ల కల.. కోహ్లీ ఏమోషన్ మమూలుగా లేదు.. వైరల్ వీడియో
2003 ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ 639 పరుగులు చేశాడు. 53.2 యావరేజ్, 139.8 స్ట్రైట్ కొనసాగించాడు.
2024 ఐపిఎల్ లో విరాట్ కోహ్లీ 741 రన్స్ చేశాడు. 61.7 యావరేజ్, 154.7 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు.
2025 ఐపీఎల్ లో ఇప్పటివరకు విరాట్ 602 పరుగులు చేశాడు. 60.2 యావరేజ్, 147.91 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు. 36 సంవత్సరాల వయసులో కోహ్లీ ఇలాంటి ఫీట్ కొనసాగించడం నిజంగా అద్భుతమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఇక 2023 సీజన్లో ఆరు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ.
గత ఐపిఎల్ లో ఐదు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు విరాట్.
ఇక ఈ సీజన్లో 8 1/2 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక గడిచిన మూడు సీజన్లలో, 42 ఇన్నింగ్స్ లలో విరాట్ కోహ్లీ 19 హాఫ్ సెంచరీలు చేశాడు. మూడు సెంచరీలు బాదాడు. అతడితో క్రికెట్ ఆడటం ప్రారంభించిన ఏ ప్లేయర్ కూడా ఈ స్థాయిలో గణాంకాలు నమోదు చేయలేదు. ఒక జట్టు తరఫున ఈ మాదిరిగా పరుగుల వరద పారించలేదు.
బెంగళూరు నాయకుడిగా ఉన్నప్పుడు కూడా విరాట్ కోహ్లీ ఇదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. ఏమాత్రం భయం అనేది లేకుండా పరుగుల వరద పారించాడు. అందువల్లే అతడిని పరుగుల యంత్రం అని పిలుస్తుంటారు. బెంగళూరు జట్టు దాదాపు 17 సంవత్సరాలుగా విరాట్ కోహ్లీని అంటిపెట్టుకొని ఉంటున్నదంటే దానికి ప్రధాన కారణం అతని డెడికేషన్. చెన్నై జట్టుకు ధోని ఎలాగో.. బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ అలా మారిపోయాడు. అందువల్లే అతడిని బెంగళూరు అభిమానులు ఎంతో ఇష్టంతో తమ మూలవిరాట్ గా పిలుచుకుంటారు.