RCB Winning Moments : గెలవాల్సిన మ్యాచ్లో బెంగళూరు గెలిచి చూపించింది. ఉత్కంఠ గా సాగిన మ్యాచ్లో చివరి వరకు పోరాడి విక్టరీని అందుకుంది. తద్వారా 18 సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్న ట్రోఫీని అందుకోవడానికి రెండు అడుగుల దూరంలో ఉంది. మొత్తంగా “ఈ సాలా కప్ నమదే” అనే నినాదాన్ని అది నిజం చేసే పనిలో పడింది. ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ విరోచితమైన బ్యాటింగ్ చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ అదరగొట్టాడు. ఏకంగా మెరుపు ఆప్ సెంచరీ తో.. చివరి వరకు నిలబడ్డాడు. జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించి.. బెంగళూరులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. నిన్న ఎప్పుడైతే విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడో అప్పటినుంచి జితేష్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. బెంగళూరు అభిమానులకు ఆరాధ్య నాయకుడిగా.. కొత్త దేవుడిగా మారిపోయాడు.
Also Read : ఏడుకు ఏడు..కోల్ కతా, ముంబైని దాటేసి బెంగళూరు నెంబర్ వన్!
అదిరిపోయే వీడియో
చివరి వరకు ఉత్కంఠ గా సాగిన మ్యాచ్లో.. జితేష్ కొట్టిన సిక్సర్ తో బెంగళూరు జట్టులో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆటగాళ్లు అమాంతం ఎగిరి గంతులు వేశారు. ఇక అభిమానులైతే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నృత్యాలు చేస్తూ.. భళా బెంగళూరు అంటూ నినాదాలు చేశారు. ” కప్ కొడుతున్నాం. సుదీర్ఘంగా ఉన్న కలను నెరవేర్చుకుపోతున్నామంటూ” బెంగళూరు అభిమానులు నినాదాలు చేశారు. ఇక ఎప్పుడైతే జితేష్ శర్మ విన్నింగ్ షాట్ గా సిక్సర్ కొట్టడంతో.. డగ్ అవుట్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఎగిరి గంతులు వేశాడు. పక్కనే ఉన్న కృణాల్ పాండ్యాను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. “హుర్రే మనం గెలిచాం..టాప్ -2 లోకి వెళ్లిపోయామంటూ” నినాదాలు చేశాడు.
బెంగళూరు మ్యాచ్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి విరాట్ కోహ్లీ బయటకు వచ్చాడు. బయటికి వస్తున్నప్పుడు ఒక రకమైన విధంగా నడక నడిచాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.. మైదానంలోకి వచ్చిన తర్వాత సూపర్ ఇన్నింగ్స్ హీరో జితేష్ శర్మకు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆ లింగనం చేసుకున్నాడు.. జట్టును గెలిపించినందుకు థాంక్స్ అంటూ కృతజ్ఞతలు తెలియజేసాడు..” నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టావ్. బెంగళూరులో గెలిపించి మా మీద ఉన్న భారాన్ని మొత్తం తగ్గించావ్.. నిన్ను బెంగళూరు అభిమానులే కాదు.. మేం కూడా ఆరాధిస్తున్నాం. నీ ఇన్నింగ్స్ కు అద్భుతం అనే మాట సరిపోదు. అనితర సాధ్యమైన స్థాయిలో బ్యాటింగ్ చేశావు. నీ స్ఫూర్తి ఎప్పటికి నిలిచి ఉంటుందని” విరాట్ కోహ్లీ జితేష్ శర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.. ఇక అంతకు ముందు విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యాన్ని పంత్ బృందం ఉంచినప్పటికీ.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా బెంగళూరు దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. సాల్ట్, విరాట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. లక్నో బౌలర్లపై ప్రారంభం నుంచి ఎదురుదాడికి దిగారు.
They are pumped up & HOW @RCBTweets enter the 2️⃣ with momentum led by their charismatic skipper Jitesh Sharma
Scorecard ▶ https://t.co/h5KnqyuYZE #TATAIPL | #LSGvRCB pic.twitter.com/N0YAz0f95u
— IndianPremierLeague (@IPL) May 27, 2025