Virat Kohli Impact Player rule : కన్నడ జట్టు విజయం సాధించిన తర్వాత బౌండరీ లైన్ దగ్గర ఉన్న కోహ్లీ అదే పనిగా ఏడ్చేశాడు. దుఃఖాన్ని ఆపుకుంటూ మైదానంలో అలా పడుకుని ఉండిపోయాడు. చివరికి తన భావోద్వేగాన్ని నియంత్రించుకుంటూ జట్టు ఆటగాళ్లతో సంబరాలు జరుపుకున్నాడు. తన సతీమణి అనుష్క శర్మ నుంచి మొదలుపెడితే ఏ బి డివిలియర్స్ వరకు ప్రతి ఒక్కరితో తన ఆనందాన్ని పంచుకున్నాడు.. అదే పనిగా విరాట్ ఏడుస్తుంటే తోటి ఆటగాళ్లు అతడిని సముదాయించారు. భావోద్వేగాన్ని కాస్త అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఆ తర్వాత అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు కోహ్లీ.. బెంగళూరు అభిమానులు సుదీర్ఘంగా నిరీక్షించారని.. వారి కలను నిజం చేశామని కోహ్లీ పేర్కొన్నాడు..
కన్నడ జట్టు విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు..” నేను క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తాను. మైదానంలో ఎక్కువసేపు ఉండడాన్ని ఇష్టపడతాను. అంతే తప్ప ఇలా వచ్చి అలా వెళ్ళిపోను. అలా జరిగితే నేను మ్యాచ్లో ఉండను. అది నా స్వభావానికి పూర్తి విరుద్ధం. జట్టు గెలిచినప్పటికీ.. ఓడిపోయినప్పటికీ.. ఆ రెండు సందర్భాలలో నా పూర్తి పాత్ర కచ్చితంగా ఉంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. నేను పొట్టి ఫార్మాట్లో 20 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసి.. ఫీల్డ్ లో నా ఇన్ఫాక్ట్ చూపించడానికి ప్రయత్నిస్తాను. నేను అలాంటి ఆటగాడిని మాత్రమే. అంత తప్ప ఇలా వచ్చి అలా వెళ్ళిపోను. అలా వెళ్ళిపోతే నా ప్రభావం ఉండదు కదా.. అలాంటి మ్యాచ్లో నేను ఆడాలని కోరుకోను. నా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి మాత్రమే క్రికెట్ ఆడతానని” విరాట్ వ్యాఖ్యానించాడు.
Also Read : 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూల”విరాట్”.. ఒకే ఒక్కడిగా రికార్డ్
విరాట్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. అయితే అతడు ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది. ఎందుకంటే రోహిత్ శర్మ ఇటీవల కాలంలో అనేక సందర్భాలలో ఇంఫాక్ట్ ఆటగాడిగా మైదానంలోకి వచ్చాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి.. వెళ్లిపోయాడు. ఇటీవల ఒక మ్యాచ్లో క్యాచ్ మిస్ చేశాడు అని చెప్పి ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ అతడిని డగ్ అవుట్ కు పంపించాడు.. అప్పట్లో అదొక సంచలనంగా మారింది. ఇక అయ్యర్ జట్టుతో ఇటీవల జరిగిన క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో రోహిత్ విఫలమయ్యాడు. రోహిత్ విఫలం కావడంతో ముంబై జట్టు భారీగా స్కోర్ చేయలేకపోయింది. చివర్లో ఆర్థిక జట్టు ఆటగాళ్లు రెచ్చిపోయినప్పటికీ.. ఆ స్కోర్ అయ్యర్ జట్టును ఇబ్బంది పెట్టలేకపోయింది.. అయ్యర్ కడదాకా ఉండి.. ఆస్కోరును చేజ్ చేసి తన జట్టును గెలిపించుకున్నాడు. చివరి అంచె దాకా తీసుకెళ్లాడు. కాని చివర్లో అయ్యర్ ఒక్క పరుగు మాత్రమే చేయడంతో ప్రీతి జింటా జట్టుకు ఓటమి తప్పలేదు.