RBI Gives 500 rupee notes in the country : అయితే గత కొన్ని రోజుల నుంచి సామాజిక మాధ్యమాలలో అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో త్వరలో చలామణి లో ఉన్న రూ.500 కరెన్సీ నోట్లు రద్దు చేయనున్నారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి నెల నాటికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం చలామణి లో ఉన్న రూ.500 విలువైన కరెన్సీ నోట్లను రద్దు చేయడం అనే వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. దీనికి సంబంధించి రీసెంట్ గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్క విభాగం ఒక కీలక ప్రకటన జారీ చేసింది. ఓ యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా గత కొన్ని రోజుల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 2026 నాటికి ప్రస్తుతం దేశంలో చలామణి లో ఉన్న రూ.500 విలువైన కరెన్సీ నోట్లను పూర్తిగా నిలిపివేయనుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. వైరల్ అవుతున్న ఈ వార్తలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై వివరంగా స్పష్టత ఇచ్చింది. త్వరలో రూ.500 కరెన్సీ నోట్లు పూర్తిగా నిలిపివేయబడతాయి అనే వార్తలు నిరాధారమైనవని, ఇందులో నిజం లేదని తేల్చి చెప్పేసింది. పి ఐ బి ఫ్యాక్ట్ చెక్ విభాగం తమ అధికారిక వెబ్సైట్ X లో ఈ నకిలీ ప్రచారంపై ప్రజలందరిని అప్రమత్తం చేస్తూ ఒక కీలక పోస్టు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి ప్రకటన ఏది చేయలేదు అని స్పష్టంగా తెలిపింది. రూ.500 విలువైన కరెన్సీ నోట్లు నిలుపుదల కావని తెలిపింది. చట్టబద్ధంగా రూ.500 నోట్లు చెల్లుబాటు అవుతాయి అని ప్రకటనలో పిఐబి స్పష్టంగా తెలిపింది.
Also Read : నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
కేంద్రం ఇటువంటి నిరాధారమైన మరియు తప్పుదోవ పట్టించే వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే ప్రభుత్వం ఏదైనా వార్తను విని నమ్మేముందు లేదా ఇతరులకు షేర్ చేసే ముందు వాటి యదార్థతను అధికారిక వర్గాల నుంచి ధ్రువీకరించుకోవాలని ప్రజలకు సూచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్థిక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే ఇటువంటి వార్తలను విశ్వసించాలని లేని పక్షాన ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మొద్దని ప్రజలకు సూచించింది.