Virat Kohli: అభిమానులు భారీగా రావడంతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం సందడిగా మారింది. విరాట్ కోహ్లీ, ఆర్సిబి నామస్మరణతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడిగామారాయి.. గత కొద్దిరోజులుగా టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్లో దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. కీలకమైన మ్యాచ్లలో ఓడిపోయి పరువు తీసుకున్నది. ఈ క్రమంలో జట్టును గాడిలో పెట్టడానికి బీసీసీఐ కఠిన నిబంధనలను తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆటగాళ్లు మొత్తం దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్, కేఎల్ రాహుల్ వంటి వారు రంజి ట్రోఫీ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇంగ్లాండ్ జట్టుతో టి20 సిరీస్ కు దూరంగా ఉన్నవారు కూడా రంజీ ట్రోఫీలో ఆడుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ మెడనొప్పితో మొదటి మ్యాచ్ ఆడలేదు. ఇక గురువారం రైల్వేస్ తో ప్రారంభమైన చివరి లీగ్ రంజీ మ్యాచ్లో ఢిల్లీ జట్టు తరఫున విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగాడు. ఈ మ్యాచ్ కు ఉచితంగా టికెట్లు ఇవ్వడంతో ప్రేక్షకులు భారీగా వచ్చారు. వేలాది సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.
ఉదయం 3 గంటల నుంచి..
ఉదయం 3 గంటల నుంచే స్టేడియం బయట బారులు తీరారు. కోహ్లీ, ఆర్ సి బి అంటూ నినాదాలు చేశారు. ప్రేక్షకులు భారీగా రావడంతో ప్రతి స్టాండ్ కూడా నిండిపోయింది.. అయితే అయితే భద్రత కారణాలతో కొంతమంది అభిమానులను పోలీసులు మైదానంలోకి అనుమతించలేదు. మరోవైపు ఒక దేశవాళీ మ్యాచ్ కోసం ఈ స్థాయిలో ప్రేక్షకులు రావడం ఇదే తొలిసార ని తెలుస్తోంది. స్టేడియానికి భారీగా ప్రేక్షకులు రావడంతో విరాట్ కోహ్లీ వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మరోవైపు విరాట్ కోహ్లీ ఫామ్ లో లేక చాలా రోజులవుతోంది. అయినప్పటికీ జనాలు ఏమాత్రం తగ్గకుండా వచ్చారు. మరోవైపు ఈ మ్యాచ్ ను జియో సినిమా లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. అయితే వాస్తవానికి ఈ మ్యాచ్ కు లైవ్ లేకపోయినప్పటికీ.. కోహ్లీ రంగంలోకి దిగడంతో.. దానిని క్యాష్ చేసుకోవడానికి జియో సినిమా లైవ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మ్యాచ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు అభిమానులు కోహ్లీ పేరు స్మరిస్తున్నారు అంటే.. అతడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Commentator said “We haven’t seen the crowds like this in a domestic match, this is just for Virat Kohli. The crowd puller King Kohli”. – Craze for Kohli #ViratKohli #Kohli #Virat #RanjiTrophy pic.twitter.com/IbkOF1mBv3
— FOREVER (@Cineandcric) January 30, 2025