Virat Kohli And Rohit Sharma: టీమ్ ఇండియా కోసం ఎన్నో మ్యాచ్‌లు గెలిపించి, దేశం కోసం అహర్నిశలు శ్రమించిన దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడు కెరీర్ చివరి దశలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ క్రికెట్ ఐకాన్లను కెప్టెన్సీ నుంచి అవమానకరంగా తొలగించడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది.
ఒకరిపై ఫామ్ సమస్యను, మరొకరిపై కప్ ఫలితాలు కారణంగా బాధ్యతలు తొలగించారు.. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత కూడా ప్లేయర్లుగా జట్టులో కొనసాగాలని విరాట్-రోహిత్ నిర్ణయించుకున్నారు. అయితే, వారికి ఇప్పుడు మరో పరీక్ష ఎదురవుతోంది.
*దేశవాళీ లీగ్‌లో ఆడాల్సిన పరిస్థితి
బీసీసీఐ, ముఖ్యంగా చీఫ్ సెలక్టర్ అజిత్ ఆగార్కర్ సూచనల మేరకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లు దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని ఆదేశించారు. దాంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
విజయ్ హజారే ట్రోఫీలో 3-4 మ్యాచ్‌లు ఆడాలని సెలక్టర్లు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఫామ్ నిరూపించుకోవడమే కాకుండా, 2027 ODI వరల్డ్‌కప్ లక్ష్యంపై దృష్టి పెట్టడానికి కూడా ఉపయోగపడనుంది.
రాబోయే షెడ్యూల్
నవంబర్‌లో దక్షిణాఫ్రికా సిరీస్
జనవరిలో న్యూజిలాండ్ సిరీస్
మధ్యలో విజయ్ హజారే ట్రోఫీ
ఈ షెడ్యూల్‌లో దేశవాళీ టోర్నమెంట్ ఆడడం ద్వారా పెద్ద టోర్నమెంట్లలో ఫామ్, ఫిట్నెస్ నిలుపుకోవడమే కాకుండా, యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలవగలమని ఇద్దరూ భావిస్తున్నారని అంతర్గత సమాచారం.
కెరీర్ చివరి దశలో వీరి కష్టాలు, తిరిగి ఫామ్‌లోకి రావాలనే ప్రయత్నాలు అభిమానుల హృదయాలను కదిలిస్తున్నాయి. ఇప్పుడు విజయ్ హజారేలో వారు చేసే ప్రదర్శన, భవిష్యత్ అవకాశాలను నిర్ణయించనుంది.