Balakrishna Vs Nagarjuna: సినిమా ఇండస్ట్రీ లో రాణించాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాలి అనేది వట్టి మాట… ముందు మన దగ్గర మ్యాటర్ ఉండాలి.ఇండస్ట్రీ లో ఉన్న 20,30 మంది హీరోలు సినిమాలు చేస్తే అందులో కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపు లభిస్తోంది. వాళ్ళు మాత్రమే ఎక్కువ సినిమాలను చేస్తూ వాళ్ల కెరియర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘నందమూరి తారక రామారావు’ గారి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య వరుస సక్సెస్ లను సాధించాడు. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన ఇప్పటికి మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చిన నాగార్జున సైతం మొదట్లో రొమాంటిక్ సినిమాలు చేశాడు. ఆ తర్వాత పౌరాణికాలు, కమర్షియల్ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. కెరియర్ మొదట్లో బాలయ్య నాగార్జున ల మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం వల్ల మధ్య అసలు మాటలు లేవు.
ఒకరికొకరు అసలు మాట్లాడుకోరు. కారణం ఏంటి అంటే ఒక సినిమా విషయంలో వీళ్ళిద్దరి మధ్య అనుకోని వివాదం జరిగిందట. ఆ సినిమాని ఇద్దరూ చేయాలనుకున్నారు. దానివల్ల ఇద్దరి మధ్య ఒక గొడవలైతే వచ్చాయట. ఎట్టకేలకు ఆ సినిమాని ఆ ఇద్దరు హీరోలు కాకుండా వేరే హీరో చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. దానివల్ల వచ్చిన మనస్పర్థాలతో అప్పటినుంచి ఇప్పటివరకు మాట్లాడుకోవడం లేదు…
నందమూరి బాలయ్య ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే నాగార్జున కొడుకు అయిన నాగ చైతన్య లేదంటే అఖిల్ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్తారు తప్ప నాగార్జున మాత్రం అస్సలు వెళ్ళడు. ఇక అక్కినేని ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ జరిగితే బాలయ్య బాబు అస్సలు హాజరవ్వడు.
ఇక ఇదంతా చూస్తున్న అభిమానులు మాత్రం వీళ్ళ మధ్య గొడవలు ఎప్పుడు తీరిపోతాయి. వీళ్ళు కలిసి మాట్లాడుకుంటారా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…ఇక మరికొంతమంది మాత్రం వీళ్ళు కలిసి సినిమా చేస్తే బాగుంటుంది అంటూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు…