Virat Kohli : విరాట్ కోహ్లీ గత ఏడాది పొట్టి ఫార్మాట్ నుంచి శాశ్వత విశ్రాంతి తీసుకున్నాడు. టీమిండియా పొట్టి ప్రపంచ కప్ గెలుపొందిన తర్వాత.. ఆ విభాగానికి విరాట్ కోహ్లీ పూర్తిగా వీడ్కోలు పలికాడు. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సరసన అతడు నిలిచాడు. ఇక ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా పూర్తిగా పక్కకు తప్పుకోవాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రఖ్యాత ఇంగ్లీష్ పత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో వెల్లడించింది..” విరాట్ కోహ్లీ ఇటీవల బీసీసీ పెద్దలను కలిశాడు. తను టెస్ట్ ఫార్మాట్ నుంచి పక్కకు తప్పుకోవాలని అనుకుంటున్నట్టు బిసిసిఐ పెద్దలకు చెప్పాడు. దానికి వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తేరుకొని.. విరాట్ కోహ్లీకి సర్ది చెప్పారు. కొద్దిరోజులు ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని సూచించారు. దానికి విరాట్ కోహ్లీ ఎటువంటి సమాధానం చెప్పలేదు. బహుశా విరాట్ కోహ్లీ సమాధానం కోసం బోర్డు పెద్దలు ఎదురుచూస్తున్నట్టుంది. ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీకి ఏ++ కేటగిరిని బీసీసీఐ కల్పించింది. ఈ కేటగిరిలో రోహిత్ శర్మ, బుమ్రా, రవీంద్ర జడేజా కూడా ఉన్నారు. అయితే వీరిలో రోహిత్ శర్మ ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసాడు. ఇప్పుడు ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా ఉండాలనుకోవడం విశేషం. ఒకవేళ విరాట్ కోహ్లీ గనుక టెస్ట్ ఫార్మాట్ ను పక్కకు తప్పుకుంటే.. ఏ++ కేటగిరిలో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే మిగులుతారు. అప్పుడు ఆ రెండు స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారిందని” ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో వెల్లడించింది.
Also Read : మీ వల్లే మేమిలా.. సైన్యానికి విరాట్ కోహ్లీ హాట్సాఫ్!
అందువల్లేనా..
విరాట్ కోహ్లీ కొన్ని సంవత్సరాలుగా తీరికలేని క్రికెట్ ఆడుతున్నాడు. అయితే విపరీతమైన స్టార్ డం కారణంగా అతడు సాధారణ జీవితం గడపలేక పోతున్నాడు. మైదానంలో ఉంటే అతడిని చూడడానికి వేలాదిమంది అభిమానులకు వస్తున్నారు. బయటికి వెళ్తే లక్షల మంది అతని చుట్టూ మూడుతున్నారు. ఇలాంటి స్థితిలో అతడికి ప్రైవేట్ లైఫ్ అనేది ఉండడం లేదు. అందువల్లే తన కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిపోవాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అతని కుమారుడు లండన్ లో జన్మించాడు. కొంతకాలంగా విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తన పిల్లలతో కలిసి లండన్లోనే ఉంటున్నది. క్రికెట్ మ్యాచ్లు ఉంటే విరాట్ కోహ్లీ నేరుగా లండన్ నుంచి ఇండియాకు వస్తున్నాడు. గత టి20 వరల్డ్ కప్ సమయంలో విరాట్ కోహ్లీ.. లండన్ నుంచి వచ్చి జట్టు సభ్యులతో కలిశాడు. బహుశా అందువల్లే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి దూరం జరగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అతడు గనుక టెస్ట్ ఫార్మాట్ నుంచి పూర్తిగా బయటికి వెళ్లిపోతే.. కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమవుతాడు. వన్డే వరల్డ్ కప్ కనుక టీమ్ ఇండియా గెలిస్తే అప్పుడు శాశ్వతంగా క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడు. ఒకవేళ శరీర సామర్థ్యం సహకరిస్తే ఐపీఎల్ లో ఆడతాడు. లేకపోతే దానికి కూడా వీడ్కోలు పలికి కుటుంబంతో కలిసి లండన్ లో ఉంటాడు. అన్నట్టు విరాట్ కోహ్లీ అత్యంత భారీగా ఖర్చు చేసి ముంబై నగరంలో విలాసవంతమైన భవనాన్ని నిర్మించాడు. బహుశా అతడు అందులో కూడా కుటుంబంతో కలిసి నివాసం ఉండే అవకాశం ఉంది.
Also Read : వీర విహారం చేసే విరాట్ కెప్టెన్సీ ని ఎందుకు వదిలేసాడు.. ఇన్నాళ్లకు తెలిసిన అసలు నిజం!