War Siren: భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే శత్రుదేశం పాకిస్తాన్ వరుసగా క్షిపణులు దాడి చేస్తుండడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. అయితే వీటిని భారత్ సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. అయినా ఇలాంటి సమయంలో బార్డర్ లో ఉన్న సైనికులు మాత్రమే కాకుండా దేశ ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మాక్ డ్రిల్ ను నిర్వహించిన కేంద్రం.. ఆ తర్వాత ప్రజలకు తగిన సూచనలను అందిస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని సైరాన్ ద్వారా లేదా.. మొబైల్ లోని మెసేజ్ ద్వారా అందిస్తారు. కానీ ఒక్కోసారి నెట్వర్క్ సమస్య వల్ల మొబైల్కు మెసేజ్ అందకపోవచ్చు. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే?
పహల్గాం దాడి తర్వాత భారత్ ఉగ్రవాదులపై ఫోకస్ పెట్టింది. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ యుద్ధం కోసం రెచ్చగొడుతుంది. ఈ సమయంలో భారత్ ఎయిర్ ఫోర్స్ తో పాటు ఆర్మీ సమర్థవంతంగా పనిచేస్తూ భారత ప్రజలను కాపాడుతూ వస్తుంది. అయినా పాకిస్తాన్ సైనికులు బార్డర్లో కాల్పులు జరపడంతో కొంతమంది పౌరులను కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా జమ్మూకాశ్మీర్లోని ఓ అధికారి మరణించడం విషాదంగా మారింది. అయితే యుద్ధ సమయంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఎవరు చెప్పలేరు. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన ఉంటుందని కేంద్రం ఇప్పటికే కొన్ని సూచనలు చేసింది.
Also Read: India and Pakistan war : భారత్ – పాక్ యుద్ధం: ఒకే చోట నాలుగువేల ఫైటర్ జెట్ లు: ఎక్కడంటే?
సాధారణంగా యుద్ధ సమయంలో ఎయిర్ ఫోర్స్ దాడి, క్షిపణి దాడి జరిగితే కేంద్రం ముందుగానే సైరన్ తో ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఒకవేళ ఎయిర్ సైరన్ మోగితే సమీప ప్రాంతాల్లోని వారు సబ్వే లేదా అండర్పాస్ లో గాని ఆశ్రయం పొందాల్సి ఉంటుంది. పెద్ద నగరాల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా రాకెట్ల భార్య నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అయితే సైరన్ కంటిన్యూగా మోగితే ప్రమాదం తప్పిందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇంట్లోనే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ లేదా గ్యాస్ వస్తువుల వాడకాన్ని ఆపివేయాలి. తలుపులు కిటికీలు మూసివేయాలి. యుద్ధ ప్రాంతాల్లో ఆహారంతో పాటు ఇతర నిత్యవసర వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకుని ఉండాలి.
Also Read: Mehbooba Mufti : మెహబూబా ముఫ్తీ శాంతి పిలుపు.. నిజమా, రాజకీయమా?
ఇలాంటి సమయంలో ఒక్కోసారి సైరన్ వినిపించే అవకాశం ఉండదు. దీంతో ప్రభుత్వం మొబైల్ మెసేజ్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తుంది. కానీ నెట్వర్క్ సమస్య వల్ల మొబైల్ మెసేజ్ కూడా రాకపోవచ్చు. అయితే నెట్వర్క్ లేకున్నా మొబైల్ లో ఈ సెట్టింగ్స్ ని ఏర్పాటు చేసుకుంటే సైరన్ వచ్చే అవకాశం ఉంది. అందుకోసం ఆపిల్ ఫోన్ అయితే settings లోకి వెళ్లి notification అనే ఆప్షన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు test alert అనే దానిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారు settings లోకి వెళ్లి safety and emergency అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు emergency అనే దానిపై క్లిక్ చేసి.. wireless emergency alerts అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నెట్వర్క్ లేకున్నా కూడా మొబైల్ కు సైరన్ మెసేజ్ వస్తుంది.