Virat Kohli: విరాట్ కోహ్లీ ఇటీవల బీసీసీఐ పెద్దలను టెస్ట్ కెప్టెన్సీ అడిగాడు. దానికి వారు ఒప్పుకోలేదు. దీంతో కోహ్లీ మన స్థాపానికి గురయ్యాడు. అప్పటినుంచి అతడు పెద్దగా ఎవరితో మాట్లాడటం లేదు. ఒకానొక సందర్భంలో టెస్ట్ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలుకుతానని సంకేతాలు ఇచ్చాడు. ఈ విషయం బీసీసీఐ పెద్దల దాకా వెళ్ళింది. దీంతో వారు రంగంలోకి దిగి విరాట్ కోహ్లీతో మాట్లాడారు. “ఇప్పటికే రోహిత్ టెస్ట్ జట్టుకు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. సీనియర్ ఆటగాళ్లు లేకపోవడం వల్ల ఇంగ్లాండ్ జట్టు నుంచి ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతుంది. అది అంతిమంగా జట్టు విజయాలపై ప్రభావం చూపిస్తుంది.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ సైకిల్ మొదలవుతున్న సందర్భంలో ఇలాంటి నిర్ణయం సరికాదు.. ఇంగ్లాండ్ టూర్ వరకు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విరాట్ కోహ్లీకి” బోర్డు పెద్దలు సూచించారు. దీంతో తనకు కాస్త సమయం కావాలని విరాట్ కోహ్లీ వారికి సమాధానం చెప్పాడు.
Also Read: నిన్న రోహిత్.. నేడు విరాట్.. ఇంగ్లాండ్ లో టీమిండియా పరిస్థితి ఎలా ఉండబోతుందంటే?
క్రికెటర్లు ఏమన్నారంటే!
విరాట్ కోహ్లీ ఆకస్మాత్తుగా సోమవారం టెస్ట్ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలకడంతో ఒక్కసారిగా సంచలనం నెలకొంది. వాస్తవానికి విరాట్ కోహ్లీ బోర్డు పెద్దల విజ్ఞప్తిని మన్నించి జట్టులో కొనసాగుతాడని అందరూ అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ శాశ్వత వీడ్కోలు పలికాడు. బోర్డు పెద్దలు షాక్ కు గురయ్యారు. ఇక ఆటగాళ్లు కూడా అదే స్థాయిలో ఉండిపోయారు. విరాట్ కోహ్లీ నిర్ణయం పట్ల టీమిండియా మాజీ ఆటగాళ్లు సైతం ఆశ్చర్యమే వ్యక్తం చేస్తున్నారు. హర్భజన్ సింగ్ అయితే తన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో మొహమాటం లేకుండా చెప్పేశాడు..” విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అతడు తీసుకున్న నిర్ణయం వల్ల జట్టు తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే సిరీస్ కు ముందు విరాట్ కోహ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పటికి జీర్ణం కావడం లేదు.. విరాట్ కోహ్లీ ఏం నిర్ణయం తీసుకున్నాడో అతడి అభిమానులకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.. అసలు ఏంటిది ఇదంతా” అంటూ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించాడు. ఇక ఇంగ్లాండ్ జట్టు మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కూడా విరాట్ కోహ్లీ శాశ్వత వీడ్కోలు నిర్ణయంపై షాక్ కు గురయ్యాడు. అతడు కూడా సోషల్ మీడియాలో ఏంటిది విరాట్ కోహ్లీ అనే అర్థం వచ్చేలాగా కామెంట్స్ చేశాడు.. విరాట్ కోహ్లీ టెస్ట్ జట్టు నుంచి పక్కకు తప్పుకోవడం ఒక రకంగా షాకింగ్ పరిణామం అని.. విరాట్ లేని లోటును బీసీసీఐ ఎవరితో భర్తీ చేస్తారనేది చూడాల్సి ఉంది.