Rohit And Kohli Retirement: 2007లో ఇంగ్లాండ్ జట్టుపై టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత.. ఇంతవరకు టీం ఇండియా మరోసారి ఆ ఘనతను అందుకోలేకపోయింది. ప్రతి సందర్భంలోనూ సిరీస్ విజయం దాకా వచ్చి తలవంచింది.. అయితే ఈసారి ఎలాగైనా సిరీస్ విజయాన్ని అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నది.. అయితే బీసీసీఐ ఒకటనుకుంటే.. ప్లేయర్లు మరొకటి అనుకుంటున్నారు. అందువల్లే టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తప్పుకున్నారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కి ముందు వారు ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులకు ఒకరకంగా షాక్ కలిగిస్తోంది. ఈ నిర్ణయం భారత జట్టు పై ప్రభావం చూపిస్తుందని.. క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.. ఎందుకంటే జూన్లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ ద్వారా 2025 -27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్ ను భారత్ మొదలు పెడుతుంది. మొత్తంగా ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా ఐదు టెస్టులు ఆడుతుంది. ఈ ఐదు టెస్టులు టీమ్ ఇండియాకు అత్యంత ముఖ్యం. ఎందుకంటే గత రెండు పర్యాయాలు టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్ళింది. కానీ విజేతగా నిలవలేకపోయింది. ఇక ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో భారత్ చివరి అంచే వరకు తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో దారుణమైన ఓటమిని ఎదుర్కొన్న తర్వాత భారత్ నిరాశజన
కగంగా ఇంటి బాట పట్టాల్సి వచ్చింది.
Also Read: పనిచేయని బీసీసీఐ బుజ్జగింపులు.. టెస్టులపై విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం
వారిద్దరు లేకుండా
రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలకడం.. విరాట్ కోహ్లీ కూడా అదే నిర్ణయం తీసుకోవడంతో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తోంది. టీమిండియా కంటే ఇంగ్లాండ్ జట్టు టెస్టులలో బలవంతమైనది కాకపోయినప్పటికీ.. సొంత మైదానంలో ఆ జట్టుకు తిరుగులేదు. ఆ జట్టు బజ్ బాల్ క్రికెట్ ఆడుతుంది. దానివల్ల గతంలో విజయాలు కూడా సాధించింది. 2007 నుంచి టీమిండియా ఒక్కసారి కూడా ఇంగ్లాండ్ జట్టుపై టెస్ట్ సిరీస్ నెగ్గలేదంటే కారణం అదే. ఇప్పుడు రోహిత్ విరాట్ శాశ్వత వీడ్కోలు పలకడంతో.. టీమ్ ఇండియా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరి ప్రస్తుతం ఉన్న యువ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధిస్తుందా? 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెడుతుందా చూడాల్సి ఉంది. ఇంగ్లాండ్ పిచ్ లు బౌన్సీగా ఉంటాయి. ఈ మైదానాలపై సీనియర్ ఆటగాళ్లు మాత్రమే రాణించడానికి అవకాశం ఉంటుంది. అలాగని యువ ఆటగాళ్లు ఆడలేరని కాదు. వారు కూడా కాస్త కుదురుకుంటే గొప్ప ఇన్నింగ్స్ ఆడగలరు. దానికోసం ఆటగాళ్లు కాస్త సమయనం పాటించాలి. ఇంగ్లాండ్ బౌలర్లను అత్యంత జాగ్రత్తగా కాచుకోవాలి. లేనిపక్షంలో టీమిండియా కు ఇబ్బందికరమైన వాతావరణం తప్పదు.