T20 World Cup 2024: ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ వ్యవస్థను శాసిస్తున్న ఒకే ఒక బోర్డ్ బిసిసిఐ…ఇక అత్యంత ఖరీదైన బోర్డుగా కూడా బిసిసిఐ వెలుగొందుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టీమ్ గా తయారైంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం జూన్ లో జరగబోయే టి20 వరల్డ్ కప్ కోసం ఇండియన్ టీమ్ చాలా కసరత్తులను చేస్తుంది.
అయితే ఈ టీమ్ లో ఎవరెవరు ఆడబోతున్నారు అనే విషయానికి సంబంధించిన వివరాలను కూడా తొందర్లోనే బిసిసిఐ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇలాంటి సందర్భంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. అవి ఏంటి అంటే విరాట్ కోహ్లీని టి20 వరల్డ్ కప్ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలా ఎందుకు చేస్తున్నారు అంటే ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఎక్కువ మ్యాచ్ లు వెస్టిండీస్ లోనే జరగబోతున్నాయి. కాబట్టి అక్కడ మొత్తం స్లో పిచ్ లే ఉన్నాయి. ఇక వాటి మీద కోహ్లీ అంత ప్రభావం అయితే చూపించలేడని బిసిసిఐ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే కోహ్లీని పక్కనపెట్టి ఆయన ప్లేస్ లో వేరే యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక బిసిసిఐ తీసుకోబోయే నిర్ణయానికి కోహ్లీని ఒప్పించే బాధ్యతని చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగర్కర్ కి అప్పగించినట్టుగా తెలుస్తుంది…
ఇక టి20 వరల్డ్ కప్ మొదటి టోర్నీలో కప్పుని అందుకున్న ఇండియన్ టీం కి ఇప్పటివరకు మరోసారి వరల్డ్ కప్పు అయితే రాలేదు. ఒకటి రెండు సార్లు ఫైనల్ కి వెళ్లినా కూడా విశ్వ విజేతలుగా నిలపలేకపోయారు. ఇక గత సంవత్సరం వన్డే వరల్డ్ కప్ లో కూడా ఫైనల్ కి వెళ్లి చివరి నిమిషంలో ఆస్ట్రేలియా మీద ఓడిపోయి రన్నరప్ గా మిగిలారు. ఇక మొత్తానికైతే ఈసారి టి20 వరల్డ్ కప్ కొట్టడమే లక్ష్యంగా ఇండియన్ టీం బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దానికి సంబంధించిన ప్లేయర్లను సెలెక్ట్ చేసే పనిలో ఇప్పటికే బిసిసిఐ కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి కోహ్లీ ఆడకపోతే ఇండియన్ టీం అంత ఎఫెక్టివ్ గా తన ప్రభావాన్ని చూపించగలుగుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…