Virat Kohli: సునయాసంగా పరుగులు చేసి.. ప్రత్యర్థి జట్లపై విపరీతమైన ఒత్తిడి పెంచే విరాట్ కోహ్లీ.. కొంతకాలంగా సరైన ఆట తీరు ప్రదర్శించడం లేదు.. వేగంగా పరుగులు చేయడం లేదు.. ధాటిగా ఇన్నింగ్స్ ఆడటం లేదు. ధీటుగా బ్యాటింగ్ చేయడం లేదు. దీంతో అతనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అతని ఆట మార్చుకోవాలని అభిమానుల నుంచి నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. గత టోర్నీలలో విరాట్ వరుసగా విఫలం కావడంతో.. అతని ఆట తీరుపై చర్చ మొదలైంది. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు కూడా విఫలం కావడంతో బీసీసీఐ(BCCI) నష్ట నివారణ చర్యలకు దిగింది.. ఆటగాళ్లు మొత్తం రంజీ మ్యాచ్ లు ఆడాలని షరతు విధించింది.. జట్టుపటిష్టానికి తెరపైకి పది పాయింట్లు కూడా అందుబాటులోకి తెచ్చింది.. దీంతో ఆటగాళ్లు మొత్తం రంజీ మ్యాచ్ లు ఆడేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఇక ఢిల్లీ జట్టు విరాట్ కోహ్లీ (Virat Kohli), రిషబ్ పంత్ (Rishabh pant) కు చోటు ఇచ్చింది.. ఇందులో ఆడేందుకు రిషబ్ పంత్ తన సమ్మతాన్ని వ్యక్తం చేయగా.. విరాట్ కోహ్లీ మాత్రం ఇంతవరకు అవును అని కాని కాదు అని కాని చెప్పలేదు.. అయినప్పటికీ ఢిల్లీ జట్టు అతడికి స్థానం ఇచ్చింది.. ఒకవేళ విరాట్ కోహ్లీ కనక రంజి క్రికెట్లో ఢిల్లీ జట్టు తరుపున ఆడితే 13 సంవత్సరాల తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడినట్టు అవుతుంది. విరాట్ చివరి సారిగా 2012లో అతడు డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు.
మెడ నరం పట్టేసిందా..
అయితే విరాట్ కోహ్లీకి ఆరోగ్యం బాగాలేదని.. మెడ నరం పట్టేసిందని.. అందువల్లే అతడు రంజి క్రికెట్ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.. మెడనొప్పిని తగ్గించుకోవడానికి అతడు ఇంజక్షన్లు వాడుతున్నాడని.. అందువల్లే అతడు ఫైనల్ లో ప్లే -11 లో ఆడటం కష్టమని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.. విరాట్ కోహ్లీ గాయానికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ అతనికి గాయం అయినట్టు అధికారికంగా తెలిస్తే మాత్రం ఇంగ్లాండ్ జట్టుతో (ING vs ENG) వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ(champions trophy 2025) లో ఆడే విషయంలోనూ ఒకింత సందేహం కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ ఆడే విషయంలో ఉత్కంఠ తొలగిపోకపోవడంతో అతడి స్థానంలో జనవరి 23న సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్లో ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. అయితే తనకు కెప్టెన్సీ వద్దని రిషబ్ మొహమాటం లేకుండా చెప్పినట్టు సమాచారం.. అయితే కెప్టెన్సీ బాధ్యతలను ఆయుష్ బదోనికి అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. సౌరాష్ట్రతో పంత్ ఒకవేళ గనుక మ్యాచ్ ఆడితే దాదాపు 7 సంవత్సరాల తర్వాత రంజీలో తలపడినట్టు అవుతుంది. 2018లో చివరిసారిగా రిషబ్ పంత్ రంజీ మ్యాచ్ ఆడాడు.. ఇక ప్రస్తుతం బీసీసీఐ విధించిన నిబంధనలు ప్రకారం ప్రతి ఒక్క క్రికెటర్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సి ఉంది..గిల్, జైస్వాల్ ఇప్పటికే రంజీ ఆడేందుకు రెడీ అయ్యారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) కూడా రంజీలలో ఆడతాడు అని తెలుస్తోంది. హార్థిక్ పాండ్యా తో కలిసి అతడు నెట్స్ లో సాధన కూడా చేస్తున్నాడు.