https://oktelugu.com/

Virat Kohli: ఇండియాలో దుమ్మురేపావు.. అమెరికాలో తేలిపోతున్నావ్? ఏమైందన్నా నీకు?

ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ముఖ్యంగా న్యూయార్క్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లలో బౌలర్లు అదరగొడుతున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 11, 2024 / 06:18 PM IST

    Virat Kohli

    Follow us on

    Virat Kohli: ఐపీఎల్ లో అతడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్. జయాపజయాలతో సంబంధం లేకుండా 700+ పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించిన ట్రెండ్ సెట్టర్. అలాంటి ఆటగాడు పరుగులు తీసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. సరిగ్గా 15 రోజుల క్రితం వరకు అతడు మైదానంలో పరుగుల వరద పారించాడు. అలాంటి ఆటగాడు పరుగులు చేసేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.” ఏమైందన్నా నీకు ఇండియాలో దుమ్మురేపావు.. అమెరికాలో తేలిపోతున్నావు” అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

    ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ముఖ్యంగా న్యూయార్క్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లలో బౌలర్లు అదరగొడుతున్నారు. ఆ మైదానంపై 40 పరుగులు చేస్తేనే సెంచరీ సాధించామని బ్యాటర్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడిన రెండు మ్యాచ్లలో ఐదు పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరచాడు. ఐర్లాండ్ జట్టుపై ఒక్క పరుగు మాత్రమే చేస్తే.. పాకిస్తాన్ పై నాలుగు పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. టి20 వరల్డ్ కప్ కు ముందు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 700 కి పైగా పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే అదే దూకుడును టి20 ప్రపంచ కప్ లో అతడు కొనసాగించలేకపోతున్నాడు.

    బౌలింగ్ కు అనుకూలించే న్యూయార్క్ మైదానంపై పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఒకపక్క రిషబ్ పంత్ లాంటి ఆటగాడు స్వేచ్ఛగా పరుగులు తీస్తుంటే.. విరాట్ కోహ్లీ మాత్రం క్రీజ్ లో నిలబడేందుకే నానా తంటాలు పడుతున్నాడు.. అద్భుతమైన టెక్నిక్ తో పరుగులు చేసే విరాట్ కోహ్లీకి ఏమైందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఫ్లాట్ పిచ్ లపై మాత్రమే ఆడతాడా? బౌలింగ్ మైదానాలపై అతడు ఆడ లేడా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

    టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించాలంటే విరాట్ కోహ్లీ ఫామ్ అత్యంత ముఖ్యం.. లీగ్ దశ ముగిసిపోతే సూపర్ -8 మ్యాచ్ లు మరింత ఆసక్తికరంగా మారతాయి. గ్రూప్ దశలో మిగిలిన రెండు మ్యాచ్లలో నైనా కోహ్లీ పరుగులు సాధించి, తమకు ఆనందాన్ని కలిగించాలని అభిమానులు కోరుతున్నారు. ఈనెల 12న టీమిండియా అమెరికాతో తలపడనుంది. భారత కాలమనం ప్రకారం ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు సూపర్ – 8 కు అర్హత సాధిస్తుంది.