Danielle Wyatt Marriage: ఒక ఆడ మనిషి, మరో మగ మనిషి పరస్పరం ఇష్టపడడం సృష్టి ధర్మం. ఇరువురు మనసులు ఇచ్చిపుచ్చుకోవడం, ఆ తర్వాత ఒక్కటి కావడం, సంతానం ద్వారా వారి ప్రేమను మరింత వ్యాప్తం చేసుకోవడం ఎప్పటినుంచో చూస్తున్నదే. కానీ ఇప్పుడు మీరు చదివే ఈ కథనం పూర్తి డిఫరెంట్..
ఆమె పేరు డేనియల్ వ్యాట్. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్. వయస్సు 33 సంవత్సరాలు. ఇంగ్లాండ్ తరఫున ఇప్పటివరకు 105 వన్డేలు ఆడింది. 151 టి20 మ్యాచ్ లలో పాలుపంచుకుంది. ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగిన మూడు వన్డేలు, మూడు టి20 సిరీస్లో అదరగొట్టింది. అంతేకాదు 2014లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సరదాగా ప్రపోజ్ చేసి, సంచలనం సృష్టించింది. అలాంటి ఈ మహిళా క్రికెటర్ సిఏఏ బేస్ కు చెందిన జార్జ్ హాడ్జ్ తో కొంతకాలంగా ప్రేమలో ఉంది. హడ్జ్ లండన్ లో ఎఫ్ఏ లైసెన్స్ డ్ ఏజెంట్ గా కొనసాగుతున్నారు. 2019లో కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది స్నేహంగా మారింది. ఆపై ఒకరిపై ఒకరికి ఇష్టం పెరిగి, డేటింగ్ కు దారి తీసింది. 2019 నుంచి 2023 మార్చి వరకు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో పరస్పరం రింగులు మార్చుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
ప్రస్తుతం వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జూన్ 10న లండన్ లోని జెల్సియా ఓల్డ్ టౌన్ హాల్లో వివాహం చేసుకున్నారు. ఆ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు..”మేము మనసు పడ్డాం. ఒక జీవితంలోకి ప్రవేశించాం. ఇది మా అధికారిక ప్రకటన” అంటూ రాస్కొచ్చారు. వీళ్ళిద్దరికీ సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతున్నాయి. గత ఏడాది హ్యడ్జ్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ వ్యాట్ అందర్నీ ఆశ్చర్యపరిచింది.
క్రీడా చరిత్రలో ఇద్దరు మహిళా ఆటగాళ్లు ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2022 లో ఇంగ్లాండ్ క్రికెటర్లు కేథరిన్ బ్రంట్, నటాలియా సీవర్ వివాహం చేసుకున్నారు. న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు అమీ సాటర్త్ వైట్ – తహుహు, దక్షిణాఫ్రికా క్రికెటర్లు మరిజేన్ కాపు, డాన్ నికేర్క్ కూడా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.. అయితే వీరి సంసార జీవితం సజావుగా సాగుతోందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఆడ, మగ కలిస్తేనే సంసారమని, ఇద్దరు మగ లేదా ఇద్దరు ఆడ కలిస్తే అది గ్రహచారమని చాలామంది వీరి వివాహాన్ని చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రేమ అనేది గుడ్డిది. దాన్ని ధృవపరిచే సంఘటనలు ఈ భూమి మీద ఎన్నో జరిగాయి. అలాంటిదే ఇది కూడా.