Virat Kohli – Sachin : ‘విరాట’పర్వంలో అదొక్కటే మిగిలింది

  Virat Kohli – Sachin : ఫిట్ నెస్ లో ప్రీక్, బ్యాటింగ్ లో రాక్, ఫీల్డింగ్ లో షేక్, రన్నింగ్ లో రాక్.. క్రికెట్ లో మొత్తంగా అతడు ఒక జాక్…విరాట్ కోహ్లీ గురించి చెప్పాలి అంటే ఈ ఉపమానాలు కూడా సరిపోవేమో… సమకాలిన క్రికెట్‌లో అతడు ఓ రన్‌ మెషిన్‌. రికార్డులు సాధించడంలో, వాటిని తిరగ రాయడంలో విరాట్‌ కోహ్లీ తర్వాతే ఎవరైనా. ఎవరికీ సాధ్యం కాని రికార్డులను నెలకొల్పాడు ఈ పరుగుల […]

Written By: Bhaskar, Updated On : March 12, 2023 6:56 pm
Follow us on

Sachin and Kohli

 

Virat Kohli – Sachin : ఫిట్ నెస్ లో ప్రీక్, బ్యాటింగ్ లో రాక్, ఫీల్డింగ్ లో షేక్, రన్నింగ్ లో రాక్.. క్రికెట్ లో మొత్తంగా అతడు ఒక జాక్…విరాట్ కోహ్లీ గురించి చెప్పాలి అంటే ఈ ఉపమానాలు కూడా సరిపోవేమో… సమకాలిన క్రికెట్‌లో అతడు ఓ రన్‌ మెషిన్‌. రికార్డులు సాధించడంలో, వాటిని తిరగ రాయడంలో విరాట్‌ కోహ్లీ తర్వాతే ఎవరైనా. ఎవరికీ సాధ్యం కాని రికార్డులను నెలకొల్పాడు ఈ పరుగుల మాంత్రికుడు.

బోర్డర్‌, గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో 75వ సెంచరీ నమోదు చేశాడు. నాలుగో టెస్ట్‌ నాలుగో రోజున ఈ అరుదైన శతకం సాధించాడు. కొన్నాళ్లుగా సరైన ఇన్నింగ్స్‌ ఆడలేకపోతున్న కోహ్లీ ఈ శతకంతో తన పూర్వపు లయను అందుకున్నాడు. విమర్శకుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. సెంచరీల సెంచరీలకు మూడొంతులు పూర్తి చేసి ఇంకొక్క 25 సెంచరీల దూరంలో నిలిచాడు. ప్రస్తుత క్రికెట్‌లో 50 సెంచరీల మార్కు అందుకునేందుకు పేరొందిన క్రికెటర్లు ఆపసోపలు పడుతున్న వేళ విరాట్‌ కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో ఎవరూ కూడా విరాట్‌ కోహ్లీ దరిదాపుల్లో లేరు. నాలుగో టెస్ట్‌లు 186 పరుగులు చేసిన విరాట్‌, 14 పరుగుల తేడాతో డబుల్‌ సెంచరీ కోల్పోయాడు.

ఇప్పటి వరకూ 100 శతకాలతో సచిన్‌ టెండూల్కర్‌ పేరు మీద రికార్డు ఉంది. ప్రస్తుతం కోహ్లీ అతడిని అనుసరిస్తున్నాడు. ఆస్ట్రేలియా లెజెండ్‌ రికి పాంటింగ్‌ 71 శతకాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లెక్కల ప్రకారం కోహ్లీ ముందు సచిన్‌ను అధిగమించే రికార్డు మాత్రమే మిగిలి ఉంది తప్ప కోహ్లీకి ఇప్పట్లో పోటీ ఇచ్చే వాళ్లే వరూ లేరు. ఇక విరాట్‌ తర్వాత స్థానాల్లో జో రూట్‌ 45, డేవిడ్‌ వార్నర్‌ 45, రోహిత్‌ శర్మ 43, స్టీవ్‌ స్మిత్‌ 42 సెంచరీలతో కొనసాగుతున్నారు.

విరాట్‌ కోహ్లీ సెంచరీ చేసిన నేపథ్యంలో అభిమానుల సంతోషాలు అంబరాన్నంటుతున్నాయి. బోర్డర్‌- గవాస్కర్‌ -23 ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగులు భారీ స్కోరు చేసిన నేపథ్యంలో.. బదులుగా ఇండియా కూడా 571 పరుగులు చేసింది. మొత్తానికి 91 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా వికెట్లేమీ కోల్పోకుండా మూడు పరుగులు చేసింది.