Virat Kohli: ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లను ఆడుతున్న మన ప్లేయర్లందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. అయినప్పటికి జూన్ లో జరగబోయే వరల్డ్ కప్ కోసం ఇండియన్ టీం తొందర్లోనే 15 మందితో కూడిన ఒక టీమ్ ను సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు అని రోహిత్ శర్మ ప్లేస్ ని కన్ఫర్మ్ చేసినప్పటికీ, కోహ్లీ ప్లేస్ మీద మాత్రం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం ఐపిఎల్ లో కోహ్లీ తనదైన రీతిలో సత్తా చాటుతూ ఆడుతున్నాడు. కాబట్టి తనను కూడా టీమ్ లోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దీని మీద మాజీ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
ఇక మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన సౌరవ్ గంగూలీ స్పందిస్తూ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ ఇద్దరూ టి20 వరల్డ్ కప్ లో ఓపెనర్లు గా ఆడితే బాగుంటుంది. అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఎందుకంటే వీళ్ళు ఓపెనర్లు కావడం వల్ల కొట్టాల్సిన స్కోర్ ఎక్కువగా ఉన్నా కూడా వీళ్లు పవర్ ప్లే లోనే ఆ స్కోర్ ని కొట్టేస్తారు. ఇక దీనివల్ల మిగతా ప్లేయర్ల మీద ఎక్కువ ప్రెజర్ పడకుండా చూసుకుంటారు.అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఇండియన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ అయిన హర్భజన్ సింగ్ ఈ విషయం మీద స్పందిస్తూ కోహ్లీ ఒక మంచి ప్లేయర్ తను నెంబర్ 3 లో ఆడితే బాగుంటుంది.
ఇంకా ఓపెనర్లు గా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ ఆడితే టీమ్ కి చాలా వరకు ప్లస్ అవుతుంది. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ లో ఇండియా చాలా మంచి పరుగులు చేయగలుగుతుంది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు…అలాగే విరాట్ కోహ్లీ నెంబర్ 3 లో గానీ, నెంబర్ 4 లో గాని ఏ పొజిషన్ లో అయిన ఆడగలిగే సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి తనను నెంబర్ 3 లో ఆడిస్తే బెటరని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు…
ఇక మరొక మాజీ ప్లేయర్ అయిన యువరాజ్ సింగ్ సైతం వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు అందుబాటులో ఉండడం అనేది నిజంగా ఇండియన్ టీం చేసుకున్న అదృష్టం అంటూ రోహిత్, కోహ్లీల పైన ప్రశంసల వర్షం కురిపించాడు…ఇక జూన్ ఆరోవ తేదీన ఇండియా ఐర్లాండ్ పైన తన మొదటి మ్యాచ్ ని ఆడబోతుంది. మరో 20 రోజుల్లో బీసీసీఐ టి 20 వరల్డ్ కప్ లో ఆడే ఇండియన్ టీమ్ స్క్వాడ్ ను అనౌన్స్ చేసే అవకాశాలైతే ఉన్నాయి…