Virat Kohli Instagram: టీమిండియాలో స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం అతడు వన్డే ఫార్మేట్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇటీవల వరుసగా సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. తన ఫామ్ మీద వస్తున్న విమర్శలకు సరైన స్థాయిలో బదులు చెప్పాడు.
విరాట్ కోహ్లీ 2024లో t20 లకు, 2025లో టెస్టులకు వీడ్కోలు పలికాడు. వన్డేలు, ఐపీఎల్ లో మాత్రమే అతడు కొనసాగుతున్నాడు. ఇప్పటికే సెంచరీలపరంగా సరికొత్త రికార్డులను సృష్టించాడు విరాట్ కోహ్లీ. సమకాలీన క్రికెట్లో తన స్థాయిని ఎవరూ అందుకోలేనంతగా ఎత్తుకు ఎదిగాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఇండియాలో కేవలం మ్యాచ్ల సమయంలో మాత్రమే అతడు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం విరాట్ కుటుంబంతో కలిసి లండన్ లో నివాసం ఉంటున్నాడు.
విరాట్ కోహ్లీకి మైదానంలోనే కాదు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఆదరణ ఉంటుంది. అతడిని సోషల్ మీడియాలో 274 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇన్ స్టా గ్రామ్ నుంచి మొదలుపెడితే ట్విట్టర్ వరకు అతడికి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ ఒక్క పోస్ట్ పెడితే కోట్లల్లో వీక్షణలు లభిస్తాయి. మనదేశంలో అత్యధిక మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న వ్యక్తిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.
అయితే విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిన్నంతా అతడి ఎకౌంటు ఇంస్టాగ్రామ్ లో కనిపించలేదు. దీంతో అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురయ్యారు. విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ నుంచి తప్పుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే అతడి ఎకౌంటు టెక్నికల్ ప్రాబ్లం వల్లే కనిపించలేదని.. విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో కొనసాగుతున్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక గత ఏడాది విరాట్ కోహ్లీ ఓ అమ్మాయి పోస్టుకు లైక్ కొట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. అయితే విరాట్ కోహ్లీ ఆల్గారితం లో మార్పు వల్లే ఇలా జరిగిందని ఇన్ స్టా గ్రామ్ మాతృ సంస్థ మెటా వెల్లడించింది. అయితే ఇదంతా తనకు తెలియకుండానే జరిగిందని విరాట్ కోహ్లీ తర్వాత వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ ఆ యువతి సెలబ్రిటీ అయిపోయింది.