48 Hours Without Lungs: ఒక మనిషి బతకడానికి అవయవాలు కావాలి. ముఖ్యంగా ఊపిరితిత్తులు ఉండాలి. ఎందుకంటే మనం తీసుకునే శ్వాసను ఊపిరితిత్తులు స్వీకరిస్తాయి. ఆక్సిజన్ ను శరీర భాగాలకు అందిస్తాయి. రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి. శరీరానికి ఎంతో ఉపయోగకరమైన ఆమ్లజనిని అందిస్తాయి.
ఆక్సిజన్ అందకపోతే మనిషి బతకలేడు. ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోతే మనిషి శ్వాస తీసుకోలేడు. స్మోకింగ్.. కాలుష్యం.. అధికంగా మద్యం తీసుకోవడం.. ఇంకా కొన్ని రకాలైన రసాయనాల వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఊపిరితిత్తులు దెబ్బతింటే మనిషి మనుగడ సాగించడం చాలా కష్టం. కొన్ని సందర్భాలలో అత్యాధునిక యంత్రాల ద్వారా కృత్రిమ శ్వాస అందించినప్పటికీ మనిషి ఎక్కువ కాలం జీవించలేడు.
కరోనా సమయంలో చాలామంది ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడ్డారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అందువల్ల ఊపిరితిత్తులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంతవరకు హానికరమైన వాయువులను.. ప్రమాదకరమైన పదార్థాలను శరీరంలోకి పంపించకపోవడమే మంచిదని వైద్యులు చెబుతుంటారు. మన ఊపిరితిత్తుల ఆరోగ్యం ఆధారంగానే మనిషి మరగడం ఆధారపడి ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంతవరకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలని.. పచ్చటి ప్రకృతి మధ్య జీవితం సాగించాలని వైద్యులు చెబుతుంటారు. కాంక్రీట్ జంగిల్స్.. నగరాలలో కాలుష్యం అధికంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ప్రజల్లో చాలామందికి ఊపిరితిత్తుల సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందువల్లే వారు ఇబ్బంది పడుతుంటారు.
చలికాలం.. వర్షాకాలం వచ్చినప్పుడు ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు శ్వాసను తీసుకోవడంలో నరకం చూస్తుంటారు. అయితే అమెరికాలోని ఓ వ్యక్తి ఊపిరితిత్తులు లేకుండానే 48 గంటల పాటు బతికాడు. చికాగో నార్త్ విస్తరణ యూనివర్సిటీ వైద్యులు ఆర్టిఫిషల్ లంగ్ సిస్టం అమర్చి ఆక్సిజన్ అందిస్తూ గుండెకు రక్తప్రసరణ చేశారు. దీంతో ఊపిరితిత్తులు లేకుండానే అతడు 40 గంటల పాటు బతికాడు. ఆ క్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వల్ల రోగికి సంబంధించిన ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయి. దీంతో డాక్టర్లు వాటిని పూర్తిగా తొలగించారు. 48 గంటల దాత లభించడంతో విజయవంతంగా డబుల్ ట్రాన్స్ ప్లాంట్ చేశారు. ఈ విషయాన్ని మెడికల్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ” ఆ యువకుడికి ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రస్ సిండ్రోమ్ ఉంది. అందువల్ల అతడి రెండు ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోయాయి. దీంతో అతడి గుండెకు రక్తప్రసరణ చేయడంలో కృత్రిమ విధానాన్ని అవలంబించారు. తద్వారా అతడు 48 గంటల పాటు ఊపిరితిత్తులు లేకుండానే బతికాడని” మెడికల్ జర్నల్ తన కథనంలో పేర్కొంది.