Virat Kohli
Virat Kohli: ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా బుధవారం అఫ్ఘనిస్తాన్‌తో రెండో మ్యాచ్ ఆడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. కాగా విరాట్ కోహ్లీ – నవీన్ ఉల్ హక్ వివాదం కారణంగా ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా మ్యాచ్ ప్రారంభం నుంచే మైదానంలో కోహ్లీ నినాదాలు వినిపించాయి. మైదానంలో నవీన్ ఫీల్డింగ్ చేస్తున్నంత సేపు విరాట్ పేరు మార్మోగిపోయింది.
పరస్పర గౌరవం..
ఇక నవీన్ ఉల్ హక్ బ్యాటింగ్‌కు దిగడంతో కోహ్లీ నినాదాలు మరింత మిన్నంటాయి. ఇక భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ ఔటైన తర్వాత క్రీజులో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ తలపడ్డారు. నవీన్ బౌలింగ్‌లో కోహ్లీ మరీ దూకుడుగా ఆడలేదు. అలాగనీ నవీన్ ఉల్ హక్ కూడా కోహ్లిని ఇబ్బంది పెట్టలేకపోయాడు. అయితే స్టేడియంలో కోహ్లీ పేరు మాత్రం మార్మోగిపోయింది. నవీన్ లక్ష్యంగానే అభిమానులు కేకలు పెట్టారు. అయితే ఇక్కడే మరోసారి అందరి మనసులు గెల్చుకున్నాడు విరాట్. అభిమానుల వైపు చూస్తూ దయచేసి నవీన్‌ను గేలి చేయవద్దని కోరాడు. గతంలో స్మిత్ ను గేలిచేస్తూ భారత అభిమానులు నినాదాలు చేశారు. అప్పుడు కూడా ఫ్యాన్స్‌ను వారించాడు కోహ్లీ. దీంతో స్మిత్ సైతం కోహ్లీకి థ్యాంక్స్ చెప్పి హ్యాండ్ షేక్ ఇచ్చాడు.
గొడవకు స్వస్తి..
ఇది జరిగిన కొద్ది సేపటికే నవీన్, కోహ్లీ ఇద్దరూ కలిసి నవ్వుతూ పలకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. దీంతో గతంలో వీరి మధ్య వచ్చిన వైరానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ‘కోహ్లీ, నేను మ్యాచ్ మధ్యలో కరచాలనం చేసుకున్నాం. బయట కానీ.. మైదానంలో కానీ ఏం జరిగినా ఇంతటితో వదిలేద్దామని కోహ్లీతో చెప్పాను’ అని కోహ్లీతో జరిగిన సంభాషణ గురించి చెప్పుకొచ్చాడు నవీన్ ఉల్ హక్.
నెట్టింట్లో వైరల్..
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ ఫ్యాన్స్ ఈ వీడియోను చూసి తెగ మురిసిపోతున్నారు. ‘ఇది మా కింగ్ అంటే’.. ‘శత్రువులైనా మా ఆటగాడిని మెచ్చుకోవాల్సిందే’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Virat Kohli asking the Delhi crowd to stop mocking Naveen Ul Haq
He did it for Steve smith as well #ViratKohli𓃵 #rohit #INDvsAFG #naveen #gambhir
pic.twitter.com/TBOxvY625x— ICT Fan (@Delphy06) October 11, 2023
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Virat kohli gestures to delhi crowd not to troll naveen ul haq video wins millions of hearts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com